IND vs SL: విశాఖపట్నంలోని ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో జరిగిన రెండో మహిళల టీ20లో భారత్ మరోసారి తన ఆధిపత్యాన్ని చాటింది. శ్రీలంక మహిళల జట్టు నిర్దేశించిన 129 పరుగుల లక్ష్యాన్ని భారత్ కేవలం 11.5 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 49 బంతులు మిగిలుండగానే 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
SIR Effect: కేరళ, అండమాన్–నికోబార్, ఛత్తీస్‌గఢ్‌లో లక్షల సంఖ్యలో ఓటర్ల పేర్లు తొలగింపు..!
మ్యాచ్ విషయానికి వస్తే.. ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 128 పరుగులు మాత్రమే చేయగలిగింది. కెప్టెన్ చమరి అథపత్తు (31) దూకుడుగా ఆడగా, హర్షిత సమరవిక్రమ (33) కాస్త నిలకడగా ఆడింది. హసిని పెరెరా (22) కూడా కొంత సహకారం అందించింది. అయితే మధ్య ఓవర్లలో భారత బౌలర్లు కట్టడి చేయడంతో పరుగుల ప్రవాహం తగ్గింది. భారత బౌలింగ్‌లో స్నేహ్ రాణా ఒక వికెట్ తీసి అద్భుతంగా బౌలింగ్ చేయగా.. శ్రీ చరణి, వైష్ణవి శర్మ చెరో 2 వికెట్లు అందించారు. అలాగే కాంతి గౌడ్ కూడా ఒక వికెట్ సాధించింది.
Champion: రోషన్–నితీష్ కుమార్ రెడ్డి మధ్య ఫన్నీ చిట్‌చాట్.. ‘ఛాంపియన్’ ప్రమోషన్ వీడియో వైరల్
ఇక 129 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. స్మృతి మంధాన (14) త్వరగా ఔట్ అయినా, షఫాలి వర్మ మాత్రం శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడింది. షఫాలి కేవలం 34 బంతుల్లో 69 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది. ఈ ఇన్నింగ్స్‌లో ఆమె 11 ఫోర్లు, ఒక సిక్స్ బాదింది. ఈ నేపథ్యంలో తన 12వ అర్ద సెంచరీని అందుకుంది. మరోవైపు జెమిమా రోడ్రిగ్స్ (26) కూడా వేగంగా పరుగులు జోడించింది. వీరిద్దరూ కేవలం 22 బంతుల్లోనే 50 పరుగుల పార్టనర్షిప్ ను పూర్తి చేసారు. ఆ తర్వాత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (10) ఒక్క పరుగు చేయాలిసిన సమయంలో ఔట్ అయ్యింది. దీనితో రిచా ఘోష్ (1*) షఫాలికి జతకలిసి విజయాన్ని పూర్తి చేసింది.
A 27-ball half-century for @TheShafaliVerma, her 12th in T20Is! 🙌
She’s surely in a hurry in this run chase 😎#INDvSL 2nd T20I, LIVE NOW 👉 https://t.co/KDMkutvtLt pic.twitter.com/JkfsAVDoky
— Star Sports (@StarSportsIndia) December 23, 2025