NTV Telugu Site icon

Anushka Sharma-Virat Kohli: భారత్, దక్షిణాఫ్రికా మ్యాచ్.. అనుష్క పాటకు మైదానంలోనే డ్యాన్స్ చేసిన కోహ్లీ!

Kohli Dances To Anushka Song

Kohli Dances To Anushka Song

Virat Kohli Dancing On Wife Anushka Sharma’s Song: ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అద్భుత సెంచరీ చేశాడు. బ్యాటింగ్ కష్టంగా మారిన పిచ్‌పై 120 బంతుల్లో 10 ఫోర్ల సాయంతో సెంచరీ బాదాడు. ఈ సెంచరీ కోహ్లీ ఎంతో ప్రత్యేకమైందిగా నిలిచింది. పుట్టిన రోజు నాడు శతకం చేయడమే కాకుండా.. వన్డేలలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డును సమం చేశాడు. సెంచరీ అనంతరం విరాట్ ఫుల్ జోష్‌లో కనిపించాడు. భారత్ ఫీల్డింగ్ సమయంలో మైదానంలోనే డాన్స్ చేశాడు.

బర్త్ డే రోజున సెంచరీ చేసిన విరాట్ కోహ్లీ.. దక్షిణాఫ్రికా ఛేజింగ్ సమయంలో మంచి హుషారుగా కనిపించాడు. తనదైన స్టైల్‌లో ఫీల్డింగ్ చేస్తూ సహచరులతో పాటు అభిమానాలను అలరించాడు. దక్షిణాఫ్రికా అప్పటికే 7 వికెట్స్ కోల్పోయి ఓటమి దిశగా వెళుతోంది. ఈ సమయంలో ఈడెన్‌ గార్డెన్స్‌ మైదానంలో సాంగ్స్ వస్తుంటే.. ఫాన్స్ డాన్సులు చేశారు. మైదానంలో ఉన్న కోహ్లీ కూడా స్టెప్పులు వేశాడు. తన భార్య అనుష్క శర్మ నటించిన సినిమాలోని ‘అయినవీ అయినవీ’ పాటకు డాన్స్ చేశాడు. పఠాన్ సినిమాలోని ‘చలెయా చలెయా’ సాంగ్‌కు కూడా డ్యాన్స్ చేశాడు విరాట్. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Also Read: Ravindra Jadeja: ఫీల్డింగ్‌లో నేనే పెద్ద తోపును అని ఫీల్ కాను: రవీంద్ర జడేజా

వన్డేల్లో అత్యధిక సెంచరీల రికార్డును విరాట్ కోహ్లీ సమం చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌తో సమానంగా 49 సెంచరీలు బాదాడు. 2009లో శ్రీలంకపై ఈడెన్‌ గార్డెన్స్‌లోనే విరాట్ తొలి వన్డే సెంచరీ అందుకోవడం విశేషం. సుదీర్ఘ చరిత్ర కలిగిన వన్డే క్రికెట్లో ఇప్పటివరకూ కేవలం సచిన్‌, కోహ్లీ మాత్రమే 35 శతకాలకు పైగా నమోదు చేశారు. మరో శతకం బాదితే.. సెంచరీల హాఫ్ సెంచరీ రికార్డును కోహ్లీ నెలకొల్పుతాడు. సచిన్‌ 452వ ఇన్నింగ్స్‌ (463 మ్యాచ్‌)లో 49వ వన్డే సెంచరీ చేస్తే.. విరాట్ 277వ ఇన్నింగ్స్‌ (289 మ్యాచ్‌)లోనే ఆ రికార్డు సమం చేశాడు.

Show comments