IND vs PAK: క్రికెట్ అభిమానులకి బ్యాడ్ న్యూస్.. భారత్, పాకిస్తాన్ మ్యాచ్ కష్టమే! కారణం ఏంటంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rain may disrupt India vs Pakistan Asia Cup 2023 match on Sep 2: ఆసియా కప్ 2023 ఆరంభం అయింది. బుధవారం ముల్తాన్ వేదికగా నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ ఘన విజయం సాధించింది. నేడు పల్లెకెలె అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో బంగ్లాదేశ్, శ్రీలంక జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఇక భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య మెగా మ్యాచ్ శనివారం (సెప్టెంబర్ 2) జరగనుంది. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ ఫాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ మ్యాచ్ జరగడం కష్టమే అని సమాచారం తెలుస్తోంది.
సెప్టెంబర్ 2న భారత్, పాకిస్తాన్ మ్యాచ్ శ్రీలంకలోని పల్లెకెలె అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉందని సమచారం. శనివారం కాండీలో వర్షం పడేందుకు 90 శాతం అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. వాతావరణంలో తేమ 84 శాతం ఉంటుందని పేర్కొంది. దీంతో ఆసియా కప్ 2023లో అత్యంత ఆసక్తికర పోరు వరుణుడి ఖాతాలోకి చేరుతుందా? అనే అనుమానం అభిమానుల్లో నెలకొంది. చూడాలి మరి వరుణుడు ఏం చేస్తాడో.
Also Read
- KTR: ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు, అని ఎందుకు అంటున్నామో తెలుసా?
- డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
- 6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
- Dhruv Rathee: యూట్యూబర్ ధ్రువ్ రాఠీకి చుట్టూ బిగిస్తున్న ఉచ్చు.. ఇంటి గేటుపై కోర్టు సమన్లు..
సెప్టెంబర్ 2న జరిగే భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌కి మాత్రమే కాదు.. దాదాపుగా క్యాండీలో జరిగే అన్ని మ్యాచ్‌లకి వర్షం ముప్పు ఉందట. ఈ రోజు బంగ్లాదేశ్, శ్రీలంక మధ్య జరిగే మ్యాచ్‌కి 86 శాతం వర్షం పడే అవకాశాలు ఉన్నాయట. సెప్టెంబర్ 4న భారత్, నేపాల్ మధ్య జరిగే మ్యాచ్‌కి వర్షం ముప్పు 76 శాతం ఉందని తెలుస్తోంది. వర్షం కారణంగా ఫలితాలు కూడా తారుమారయ్యే అవకాశం ఉంది. దాంతో ఆసియా కప్ 2023లో ఆడే ప్రతి మ్యాచ్ కీలకం కానుంది.
Also Read: Gold Price Today: పసిడి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు! ఏకంగా 60 వేలు
ఆసియా కప్ 2023లో పాల్గొనేందుకు భారత జట్టు బుధవారం శ్రీలంకలో అడుగుపెట్టింది. కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, ఆల్‌రౌండర్‌లు హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా.. పేసర్ మహ్మద్ షమీ, కోచ్ రాహుల్ ద్రవిడ్ సహా జట్టంతా ప్రత్యేక బస్సులో విమానాశ్రయం నుంచి హోటల్‌కు చేరుకుంది. సెప్టెంబరు 2న పాకిస్థాన్ మ్యాచ్‌తో భారత్ తన ఆసియా కప్ 2023 పోరాటాన్ని ఆరంభిస్తుంది.
తాజావార్తలు
-
Yuzvendra Chahal: మద్యానికి బానిసయ్యా.. 26 రోజులు రిహాబ్ సెంటర్లో ఉన్నా.. చహల్ సంచలన వ్యాఖ్యలు!
-
KTR: ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు, అని ఎందుకు అంటున్నామో తెలుసా?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
Donald Trump: జనం పర్సులు నిల్.. ప్రెసిడెంట్ గారి ఆదాయం మాత్రం ఫుల్..!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
ట్రెండింగ్
-
Pappu Chakodilu: స్వీట్ షాప్ స్టైల్ క్రిస్పీ ‘పప్పు చకోడీలు’.. ఇంట్లోనే పర్ఫెక్ట్గా సులువుగా ఇలా తయారు చేసుకోండి.!
-
కారుతో రోడ్డుపైనే కాదు, గాల్లోనూ ప్రయాణం.! Elon Musk సంచలన డెమో.. గాల్లోకి దూసుకెళ్లిన Tesla Roadster..
-
డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, పెర్ఫార్మన్స్.. ఐఫోన్ నుంచి గెలాక్సీ వరకు.. బెస్ట్ Foldable Phones ఇవే..!
-
కేవలం 25 కార్లే.. వచ్చీ రాగానే సేల్ అవుట్.! Jeep Wrangler Whitecap Mojito లాంచ్..
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!