India vs New Zealand 1st Test Playing 11: బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య మరికొద్ది నిమిషాల్లో తొలి టెస్టు ఆరంభం కానుంది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. బంగ్లాదేశ్‌తో ఆడిన జట్టులో రెండు మార్పులు చేసినట్లు రోహిత్ తెలిపాడు. బ్యాటర్ శుభ్‌మన్ గిల్, పేసర్ ఆకాష్ దీప్‌లు బెంగళూరు టెస్టులో ఆడడం లేదు. భారత్ ఇద్దరు సీమర్లతో బరిలోకి దిగుతుండగా.. కివీస్ ముగ్గురు పేసర్లతో బరిలోకి దించుతోంది.
మెడ నొప్పి కారణంగా యువ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ ఈ మ్యాచుకు దూరమయ్యాడు. అతడి స్థానంలో సర్ఫరాజ్ ఖాన్ జట్టులోకి వచ్చాడు. కేఎల్ రాహుల్ మూడో స్థానంలో బ్యాటింగ్ చేయనున్నాడు. ఆకాష్ దీప్ స్థానంలో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఆడుతున్నాడు. వర్షం కారణంగా తొలి రోజు రద్దైన సంగతి తెలిసిందే. ఫలితం రాబట్టేందుకు ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నామని రోహిత్ శర్మ చెప్పాడు.
తుది జట్లు:
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్ (కీపర్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.
న్యూజిలాండ్: టామ్ లేథమ్ (కెప్టెన్), డేవన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ బ్లండెల్ (కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మ్యాట్ హెన్రీ, టిమ్ సౌథీ, అజాజ్ పటేల్, విలియమ్ ఓరూర్కీ.
Also Read: IPL 2025 Auction: పృథ్వీ షాకు షాక్.. ముగ్గురినే రిటైన్ చేసుకున్న ఢిల్లీ!
మ్యాచ్ షెడ్యూల్ ఇదే:
తొలి సెషన్: ఉదయం 9.15 గంటల నుంచి 11.30 గంటల వరకు
రెండో సెషన్: మధ్యాహ్నం 12.10 గంటల నుంచి 2.25 గంటల వరకు
మూడో సెషన్: మధ్యాహ్నం 2.45 గంటల నుంచి సాయంత్రం 4.45 గంటల వరకు