India vs Spain Fight for Bronze in Paris Olypics 2024: పారిస్ ఒలింపిక్స్ 2024లో ఎన్నో ఆశలు రేపిన భారత పురుషుల హాకీ జట్టు కీలక సమరంలో మాత్రం తడబడింది. మంగళవారం జరిగిన సెమీఫైనల్లో జర్మనీ చేతిలో 2-3తో ఓడిపోయింది. సూపర్ ఫామ్‌తో సెమీస్ చేరిన హర్మన్‌ప్రీత్ సేన.. కీలక పోరులో తీవ్రంగా శ్రమించినప్పటికీ విజయతీరాలకు చేరుకోలేకపోయింది. టోక్యో ఒలింపిక్స్ పోరులో జర్మనీని ఓడించి భారత్ కాంస్యం నెగ్గగా.. ఈ విజయంతో ఆ జట్టు ప్రతీకారం తీర్చుకుంది.
Also Read: Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్‌లో నేటి భారత్ షెడ్యూల్ ఇదే.. వినేశ్ ఫొగాట్ టార్గెట్ గోల్డ్!
సెమీస్ మ్యాచ్‌ను భారత్ ధాటిగా ఆరంభించినా అదే జోరును కొనసాగించలేకపోయింది. ముఖ్యంగా చివరి క్వార్టర్‌లో భారత ప్లేయర్స్ తేలిపోయారు. దాంతో మూల్యం చెల్లించుకోక తప్పలేదు. భారత్ తరఫున హర్మన్‌ప్రీత్ సింగ్ (7వ), సుఖ్‌జీత్ (36వ) చెరో గోల్ కొట్టారు. జర్మనీ తరఫున గొంజాలో (18వ), క్రిస్టొఫర్ (27వ), మార్కో (54వ) గోల్స్ చేశారు. భారత్ చివరిసారి 1980లో ఒలింపిక్స్‌లో ఫైనల్ ఆడింది. మరో సెమీఫైనల్లో నెదర్లాండ్స్ 4-0తో స్పెయిన్‌ను ఓడించింది. ఇక భారత్ కాంస్య పతకం కోసం ఆగష్టు 8న స్పెయిన్‌తో తలపడుతుంది. కాంస్య పతకం అయినా గెలవాలని భారత్ ఫాన్స్ కోరుకుంటున్నారు.