ICC Shock to Jasprit Bumrah: హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో నిబంధనలను అతిక్రమించినందుకు గానూ టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మందలించింది. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ సందర్భంగా ఓలీ పోప్ పరుగు తీస్తుండగా.. బుమ్రా ఉద్దేశపూర్వకంగా అతడిని అడ్డుకున్నట్లు మ్యాచ్ రిఫరీ నిర్ధారించాడు. దాంతో బుమ్రాను ఐసీసీ మందలించడంతో పాటు అతడి ఖాతాలో ఓ డిమెరిట్ పాయింట్ జత చేసింది.
ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో వన్‌డౌన్ బ్యాటర్ ఒలీ పోప్ (196) తృటిలో సెంచరీ మిస్ అయిన విషయం తెలిసిందే. పోప్ భారీ ఇన్నింగ్స్ కారణంగా ఇంగ్లండ్ గట్టెక్కింది. పోప్ కొరకరాని కొయ్యగా మారడంతో టీమిండియా బౌలర్లు అసహనానికి గురయ్యారు. ఈ క్రమంలో 81వ ఓవర్లో పోప్ వికెట్ల మధ్య పరుగు తీస్తున్నపుడు.. జస్ప్రీత్ బుమ్రా కావాలనే అతడికి అడ్డంగా వెళ్లాడు. ఈ క్రమంలో ఇద్దరూ పరస్పరం ఢీకొన్నారు. బుమ్రా ఉద్దేశపూర్వకంగా బ్యాటర్‌ను అడ్డుకున్నట్లు మ్యాచ్ రిఫరీ నిర్ధారించాడు.
Also Read: IND vs IND 2nd Test: గాయాలతో రాహుల్, జడేజా ఔట్.. సర్ఫరాజ్, సుందర్‌లకు ఛాన్స్!
ఫీల్డ్ అంపైర్లు, సంబంధిత అధికారులు జస్ప్రీత్ బుమ్రాదే తప్పని తేల్చగా.. భారత పేసర్ తన పొరపాటును అంగీకరించాడు. దీంతో ఐసీసీ లెవల్-1 తప్పిదం కోడ్ ఆఫ్ కాండక్ట్ ఆర్టికల్ 2.12 ప్రకారం బుమ్రాను మందలించడంతో పాటు ఒక డీ మెరిట్ పాయింట్ కేటాయించారు. గత 24 నెలల్లో బుమ్రా చేసిన తొలి తప్పిదం కావడంతో అతడికి స్వల్ప శిక్ష పడింది. బుమ్రా తన తప్పు అంగీకరించడంతో తదుపరి విచారణ అవసరం లేదని ఐసీసీ పేర్కొంది. రెండేళ్ల కాలంలో నాలుగు డీమెరిట్ పాయింట్స్ వస్తే.. ఒక టెస్ట్ లేదా రెండు పరిమిత ఓవర్ల మ్యాచ్ ఆడకుండా ఐసీసీ చర్యలు తీసుకుంటుంది.