ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్టు రసవత్తరంగా మారింది. 193 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా.. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 58 పరుగులకే 4 వికెట్స్ కోల్పోయింది. యశస్వి జైస్వాల్ (0), కరుణ్ నాయర్ (14), శుభ్‌మన్ గిల్ (6), ఆకాశ్ దీప్ (1) ఇప్పటికే పెవిలియన్ చేరారు. ఓపెనర్ కేఎల్ రాహుల్ (33; 47 బంతుల్లో 6×4) పోరాడుతున్నాడు. చివరి రోజు భారత్ విజయానికి…
ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఎడ్జ్‌బాస్టన్ టెస్టు మ్యాచ్‌లో భారత్ పట్టు బిగించింది. ఇంగ్లండ్ ముందు 608 పరుగుల భారీ లక్షాన్ని ఉంచిన టీమిండియా.. ఇప్పటికే మూడు వికెట్లు తీసి విజయం దిశగా సాగుతోంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ గెలవాలంటే ఈ రోజు 536 పరుగులు చేయాలి. ఇప్పటికే మూడు వికెట్లు కోల్పోయిన ఇంగ్లీష్ జట్టు.. ఆచితూచి ఆడి డ్రా చేసుకుంటుందా? లేదా తమ ‘బజ్‌బాల్’ ఆటనే కొనసాగిస్తుందా? అని అందరూ ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఐదవ రోజు ఆటపై…
Paul Collingwood and Marcus Trescothick been listed as Substitute Fielders: ధర్మశాల వేదికగా శుక్రవారం భారత్‌తో ఆరంభమైన ఐదో టెస్ట్‌లో ఇంగ్లండ్ టీమ్ తమ సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్లుగా కోచ్‌ల పేర్లను ప్రకటించింది. కోచింగ్ స్టాఫ్ అయిన పాల్ కాలింగ్‌వుడ్, మార్కస్ ట్రెస్కోథిక్‌ల పేర్లను సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్ల జాబితాలో ఇంగ్లండ్ చేర్చింది. దాంతో ఈ ఇద్దరూ కోచ్‌లు బ్రేక్ సమయాల్లో డ్రింక్స్ తీసుకుని మైదానంలోకి వచ్చారు. ఇందుకుసంబందించిన వీడియోస్, ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుటున్నాయి.…