Virat Kohli Fan Touches Rohit Sharma’s Feet: హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య గురువారం మొదటి టెస్ట్ ఆరంభం అయిన విషయం తెలిసిందే. చాలా రోజుల తర్వాత ఉప్పల్ స్టేడియంలో అంతర్జాతీయ మ్యాచ్ జరగుతుండడంతో ఫాన్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. మైదానంలో తమ అభిమాన క్రికెటర్లను చూస్తూ.. సంబరపడిపోయారు. అయితే ఈ మ్యాచ్‌లో ఓ అనూహ్య ఘటన చోటు చేసుకుంది. మైదానంలోకి దూసుకొచ్చిన ఓ అభిమాని.. బ్యాటింగ్ చేస్తున్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పాదాలను తాకాడు. ఇందుకుసంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.
మ్యాచ్ మొదటి రోజు ఇంగ్లండ్ ఆలౌట్ అనంతరం భారత్ బ్యాటింగ్ ఆరంభించింది. భారత్ ఇన్నింగ్స్ ఆరంభంలోనే ఓ అభిమాని మైదానంలోకి దూసుకొచ్చాడు. విరాట్ కోహ్లీ జెర్సీ ధరించిన అభిమాని నేరుగా రోహిత్ శర్మ వద్దకు అతడి పాదాలకు నమస్కారం చేశాడు. ఊహించని పరిణామంతో రోహిత్ షాక్ అయ్యాడు. వెంటనే భద్రతా సిబ్బంది వచ్చి ఆ అభిమానిని మైదానం నుంచి బయటకు తీసుకెళ్లారు. దీంతో కొద్దిసేపు ఆటకు అంతరాయం కలిగింది.
Also Read: Minister Roja vs Bhuvaneshwari: మీ పిల్లల మీద ప్రమాణం చేస్తారా?.. మంత్రి రోజాకు భువనేశ్వరి సవాల్!
గురువారం ఆరంభమైన మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 64.3 ఓవర్లలో 246 పరుగులకు ఆలౌటైంది. భారత స్పిన్నర్లు ఆర్ అశ్విన్ (3/68), ఆర్ జడేజా (3/88), అక్షర్ పటేల్ (2/33)తో పాటు జస్ప్రీత్ బుమ్రా (2/28) రాణించారు. కెప్టెన్ స్టోక్స్ (70; 88 బంతుల్లో 6×4, 3×6) ఒక్కడే పోరాడాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ 23 ఓవర్లలో 119/1తో మొదటి రోజు ఆట ముగించింది. యశస్వి జైస్వాల్ (76 బ్యాటింగ్; 70 బంతుల్లో 9×4, 3×6), శుభ్‌మన్ గిల్ (14 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.
Intruder on pitch….
Virat kaa jersey pehna hai Rohit kaa pair chuu raha 👀#INDvENG pic.twitter.com/axs1QhVjHl— Humerous (🦴 ) doctor (@Gaurabeyyyyy) January 25, 2024