Ambati Rayudu: ‘విరాట్ కోహ్లీ ఊహించని తప్పు చేశాడు.. అందుకే ఫామ్ కోల్పోయాడు’..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇంగ్లాండ్‌తో జరిగిన మొదటి వన్డే మ్యాచ్‌లో భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో కేవలం 6 బంతులు ఎదుర్కొన్న కోహ్లీ, 5 పరుగులు మాత్రమే చేసి జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. అంతర్జాతీయ క్రికెట్లో కోహ్లీ ఆర్చర్ చేతికి చిక్కడం ఇదే తొలిసారి. టెస్టులు, టీ20ల నుంచి ఇప్పటికే రిటైర్ అయిన కోహ్లీ కేవలం వన్డేలు మాత్రమే ఆడుతుండటం వల్ల, అతనికి మ్యాచ్‌ల మధ్య ఎక్కువ గ్యాప్ వస్తోంది. గాయం కారణంగా ఆఫ్ఘనిస్తాన్ సిరీస్‌కు కూడా దూరమవడంతో ఈ విరామం దాదాపు 6 నెలలకు పెరిగింది. ఈ సుదీర్ఘ విరామం తర్వాత బరిలోకి దిగిన కోహ్లీ త్వరగానే అవుట్ కావడంపై మాజీ క్రికెటర్ అంబటి రాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
సుదీర్ఘ విరామం తర్వాత బ్యాటర్ల దృష్టి ఎప్పుడూ లెంగ్త్ బంతుల పైనే ఉంటుందని, అందుకే ఒక్కోసారి ఫుల్లర్ బంతులను మిస్ చేస్తారని రాయుడు విశ్లేషించాడు. ఇదే తప్పు కోహ్లీ కూడా చేశాడన్నారు. కోహ్లీ మరికొన్ని మ్యాచ్‌లు ఆడితే ఈ సమస్యను అధిగమించి, శుభ్‌మన్ గిల్ లాగే సులభంగా బౌండరీలు బాదగలడని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఈ మ్యాచ్‌లో భారత్ 259 పరుగుల లక్ష్యాన్ని 6 వికెట్ల తేడాతో ఛేదించి విజయం సాధించింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 75 బంతుల్లో 80 పరుగులు చేసి రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు.
Also Read
మరోవైపు ఓపెనర్‌గా వచ్చిన రోహిత్ శర్మ కూడా 21 బంతుల్లో 11 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. దీనిపై ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ స్పందిస్తూ, రోహిత్ షాట్ ఎంపికలో పొరపాటు చేశాడని అన్నాడు. అవతలి ఎండ్ నుంచి గిల్ చక్కగా పరుగులు చేస్తున్నప్పుడు రోహిత్ క్రీజులో మరికొంత సమయం గడిపి ఉండాల్సిందని అభిప్రాయపడ్డాడు. అలాగే ఆర్చర్ అంతకుముందు వరుసగా షార్ట్-పిచ్, బౌన్సర్లతో ఇబ్బంది పెట్టడం వల్ల, కోహ్లీ అకస్మాత్తుగా వచ్చిన స్ట్రెయిట్ ఫుల్ డెలివరీని అంచనా వేయలేక వికెట్ చేజార్చుకున్నాడని శార్దూల్ పేర్కొన్నాడు.
తాజావార్తలు
-
Story Board : ఏపీలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ లేనట్లేనా ?
-
Harish Rao : కరువు ముందే తెలుసు కదా.. నీళ్లెందుకు నిల్వ చేయలేదు.?
-
Off The Record: నామినేషన్ల వరకు హడావుడి.. ఆ తర్వాత హ్యాండ్సప్.. సీన్లోకి వస్తారనుకుంటే సైలెంట్ అయ్యారా?
-
OTR: కూటమి కంచుకోటలో అలజడి రేగుతోందా
-
Prabhas Fauzi Glimpse: హిట్లర్‌కే దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన నేతాజీ.. ప్రభాస్ ‘ఫౌజీ’ గ్లింప్స్ ఊచకోత!
ట్రెండింగ్
-
LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!
-
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో OnePlus Ace 7 Pro.. అక్టోబర్ 29న గ్రాండ్ ఎంట్రీ..!
-
Yellow Gas Flame: గ్యాస్ మంట పసుపు లేదా నారింజ రంగులో వస్తోందా? ప్రమాదం పొంచి ఉండొచ్చు జాగ్రత్త సుమీ..!