Suryakumar Yadav React on Bowling Options in Field: మైదానంలో ఎవరికి బౌలింగ్ ఇవ్వాలనేది కెప్టెన్‌గా తనకు పెద్ద తలనొప్పి అయ్యిందని టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు. అయితే జట్టులో ఎక్స్‌ట్రా బౌలింగ్ ఆప్షన్ ఉంటే మంచిదన్నాడు. టీమ్ ప్రణాళికలకు తగ్గట్లు రాణించడంతోనే బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టీ20లో విజయం సాధించామని చెప్పాడు. ప్రతీ మ్యాచ్‌లో మెరుగుపర్చుకోవడానికి ఏదో ఒక అంశం ఉంటుందని సూర్య చెప్పుకొచ్చాడు. ఆదివారం గ్వాలియర్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన మొదటి టీ20లో భారత్ ఘన విజయం సాధించింది.
మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ… ‘మా నైపుణ్యాలకు తగ్గట్లు ఆడేందుకు ప్రయత్నించాం. జట్టు సమావేశాలలో మేం రచించిన వ్యూహాలను మైదానంలో అమలు చేశాం. ఈ కొత్త మైదానంలో మా ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన చేశారు. మేం బ్యాటింగ్ చేసిన విధానం చాలా బాగుంది. మైదానంలో ఎవరికి బౌలింగ్ ఇవ్వాలనేది కెప్టెన్‌గా పెద్ద తలనొప్పి అయ్యింది. అయితే ఎక్స్‌ట్రా బౌలింగ్ ఆప్షన్ ఉంటే మంచిది. ప్రతీ మ్యాచ్‌లో ఏదో ఒక విజయాన్ని నేర్చుకోవచ్చు. అలానే కొన్ని విషయాల్లో మెరుగవ్వాల్సి ఉంటుంది. దాని గురించి మేం మాట్లాడుకుంటాం. ఇక తదుపరి మ్యాచ్‌పై దృష్టి పెట్టాలి’ అని చెప్పాడు.
Also Read: Mayank Yadav: అరంగేట్ర మ్యాచ్‌లోనే అరుదైన ఘనత సాధించిన మయాంక్ యాదవ్!
తొలి టీ20 మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌ను భారత్ చిత్తు చేసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 19.5 ఓవర్లలో 127 పరుగులకు ఆలౌటైంది. మెహిదీ హసన్ మిరాజ్ (35 నాటౌట్; 32 బంతుల్లో 3×4) టాప్ స్కోరర్. టీమిండియా బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ (3/14), వరుణ్ చక్రవర్తి (3/31), మయాంక్ యాదవ్ (1/21) రాణించారు. ఛేదనలో భారత్ 11.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. హార్దిక్ పాండ్యా (39 నాటౌట్; 16 బంతుల్లో 5×4, 2×6), సూర్యకుమార్ యాదవ్ (29; 14 బంతుల్లో 2×4, 3×6), సంజు శాంసన్ (29; 19 బంతుల్లో 6×4) మెరిశారు.