Arasavilli Aravind Charitable Trust: అరసవిల్లి అరవింద్ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో పాఠశాల నూతన భవన ప్రారంభోత్సవం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విజయవాడ కేంద్రంగా అరసవిల్లి అరవింద్ సారథ్యంలో చారిటబుల్ ట్రస్ట్ నిర్వహిస్తున్నారు. ఈ ట్రస్ట్‌లో కోవిడ్ సమయంలో చికిత్సలు, అన్న దానాలు, మెడికల్ సేవలు, మంచి నీటి పథకాలు లాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు. కాగా.. తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం నందుగల మందడం గ్రామంలో శిథిలావస్థకు చేరుకున్న ప్రాథమిక పాఠశాల భవనంలో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని తెలుసుకుని.. తమ ట్రస్ట్ ఆధ్వర్యంలో నూతన పాఠశాల భవనాన్ని నిర్మించారు. ఆ భవనాన్ని నిన్న బాపట్ల ఎంపీ, లోక్ సభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ నందిగం సురేష్ ప్రారంభించారు. అనంతరం ఎంపీ సురేష్ మాట్లాడుతూ.. ట్రస్ట్ వారు స్కూల్ భవన విషయం తెలియగానే భవన నిర్మాణానికై స్వచ్ఛందంగా ముందుకు వచ్చారన్నారు. కావలిసిన అనుమతులతో కార్యరూపం దాల్చడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. ఇటువంటి సేవా కార్యక్రమాలకు తమ ప్రోత్సాహం ఎల్లప్పుడూ ఉంటుందని తెలియజేస్తూ ట్రస్ట్ వారిని అభినందించారు.
Read Also: Maldives: ప్రధాని మోడీ లక్షద్వీప్ పర్యటనతో మాల్దీవుల్లో ప్రకంపనలు.. భారత్‌పై అక్కసు..
Also Read
- 120dB స్పీకర్, IP64 రేటింగ్‌తో JioTag 2 లాంచ్.. ధర ఎంతంటే..?
- Amrapali Dubey: "పెళ్లి చేసుకోకుండానే తల్లి కావాలనుకుంటున్నాను".. అమ్రపాలి షాకింగ్ స్టేట్మెంట్
- Mumbai Indians: సీఎస్కేలోకి హార్దిక్ పాండ్యా?.. రూమర్లపై క్లారిటీ ఇచ్చిన ముంబై ఇండియన్స్!
- Hardik Pandya: గర్ల్‌ఫ్రెండ్‌తో తిరుమలలో హార్దిక్ పాండ్యా.. శ్రీవారికి తలనీలాలు సమర్పించి కొత్త లుక్‌తో షాక్..!
అనంతరం ట్రస్ట్ కోశాధికారి అరసవిల్లి రమేష్ మాట్లాడుతూ.. విద్యను మించిన ధనం ఉండదని, విద్య ఉంటే మనిషి ఉన్నత శిఖరాలను అందుకోవచ్చని అన్నారు. స్కూల్ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటేనే అది సాధ్యం అని తెలిపారు. భవనం లేక విద్యార్థులు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతోనే తాము ఈ భవన నిర్మాణం చేపట్టామని.. ఇటువంటి సేవ కార్యక్రమాలకు తాము ఎప్పుడూ వెనుకాడమని అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ప్రత్తిపాడు నియోజకవర్గం శాసనసభ్యురాలు మేకతోటి సుచరిత, మేకతోటి దయాసాగర్ దంపతులకు, ఎంపీ నందిగం సురేష్ కు కృతజ్ఞతలు తెలిపారు. ట్రస్ట్ ప్రెసిడెంట్ అరసవిల్లి అరవింద్ మాట్లాడుతూ.. అరసవిల్లి అరవింద్ చారిటబుల్ ట్రస్టు ద్వారా మరిన్ని సేవలు చేయటానికి వెనకడబోమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సెక్రటరి అరసవిల్లి పద్మావతి దేవి, ఎక్సల్ల సంస్థ C.E.O సౌజన్య రాసంశెట్టి, ట్రస్ట్ సభ్యులు మరియు తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
-
120dB స్పీకర్, IP64 రేటింగ్‌తో JioTag 2 లాంచ్.. ధర ఎంతంటే..?
-
Hridayam Murali OTT : ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అయిన లేటెస్ట్ సూపర్ హిట్ ‘హృదయం మురళి’
-
Amrapali Dubey: “పెళ్లి చేసుకోకుండానే తల్లి కావాలనుకుంటున్నాను”.. అమ్రపాలి షాకింగ్ స్టేట్మెంట్
-
Mumbai Indians: సీఎస్కేలోకి హార్దిక్ పాండ్యా?.. రూమర్లపై క్లారిటీ ఇచ్చిన ముంబై ఇండియన్స్!
-
OBHS Team Railway: రైళ్లలో కొత్త హౌస్‌కీపింగ్ బృందం.. ఇక జనరల్ కోచ్‌లలోనూ ఫస్ట్ క్లాస్ తరహా శుభ్రత..!
ట్రెండింగ్
-
Ajinkya Rahane Pension: అజింక్య రహానేకు పెన్షన్.. నెలనెలా ఎంత వస్తుందో తెలుసా?
-
Best Smartphones: రూ.50 వేలలో స్మార్ట్ఫోన్లు.. పెర్ఫార్మెన్స్, గేమింగ్, కెమెరా, బ్యాటరీలలో బెస్ట్ ఛాయస్ ఇవే.!
-
144Hz LTPO OLED డిస్ప్లే, 2nm Dimensity 9600 Pro చిప్సెట్తో రానున్న Vivo X500 Pro..!
-
Onion Cleaning Hack : ఉల్లిపాయతో గ్లాస్ మెరుస్తుందా.? వైరల్ హ్యాక్‌లో నిజం ఎంత.!
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!