Donald Trump: అమెరికాలో మరోసారి డోనాల్డ్ ట్రంప్ యుగం ప్రారంభం కానుంది. ఈరోజు సోమవారం డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
విజయవాడ కేంద్రంగా అరసవిల్లి అరవింద్ సారథ్యంలో చారిటబుల్ ట్రస్ట్ నిర్వహిస్తున్నారు. ఈ ట్రస్ట్లో కోవిడ్ సమయంలో చికిత్సలు, అన్న దానాలు, మెడికల్ సేవలు, మంచి నీటి పథకాలు లాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు. కాగా.. తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం నందుగల మందడం గ్రామంలో శిథిలావస్థకు చేరుకున్న ప్రాథమిక పాఠశాల భవనంలో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని తెలుసుకుని.. తమ ట్రస్ట్ ఆధ్వర్యంలో నూతన పాఠశాల భవనాన్ని నిర్మించారు. ఆ భవనాన్ని నిన్న బాపట్ల ఎంపీ, లోక్ సభ…
Nagoba Jatara: ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లో నూతనంగా నిర్మించిన ఆలయంలో నాగోబా విగ్రహాన్ని పునఃప్రతిష్ఠ చేశారు. ఆదివారం ఉదయం మెస్రం వాసులు నాగోబా విగ్రహాన్ని గర్భగుడిలో ప్రతిష్ఠించారు. అనంతరం తమ ఆరాధ్య దైవానికి ప్రత్యేక పూజలు చేశారు. ఉమ్మడి జిల్లాల నుంచి వేలాదిగా తరలివచ్చిన ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్ జెడ్పీ చైర్మన్ మెస్రం వంశీయులు, ఎమ్మెల్యే కోనేరు కోనప్ప పాల్గొన్నారు. మెస్రం వాసులు తొలినాళ్లలో నాగోబా దేవి దర్శనమిచ్చిన పుణ్యక్షేత్రాన్ని (పుట్ట) మాత్రమే పూజించేవారు.…
వెయ్యేళ్ల క్రితం ధరాతలంపై నడయాడిన సమతామూర్తి జగద్గురు శ్రీరామానుజాచార్యులు మళ్లీ మనకు దర్శనమివ్వనున్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల్‌లో 45 ఎకరాల విస్తీర్ణంలో శిల్పకళా శోభితమైన కళ్లు చెదిరే నిర్మాణాలు, పచ్చల కాంతులతో పుడమి నవ్వుతున్నట్లు ఎటు చూసినా మొక్కలతో హాయిగొలిపే పచ్చదనం.. వందకు పైగా ఆలయాల గోపురాలపై దేవతా మూర్తులతో ఆధ్యాత్మిక సుగంధాల మధ్య 216 అడుగుల భారీ లోహ విగ్రహంగా ఆయన వెలిశారు. ఇక, శ్రీరామనుజాచార్యుల సహస్రాబ్ది సమారోహ ఉత్సవాల కోసం ముచ్చింతల్…
తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారో లేదో… తమ రాక్షసత్వం ఎలా ఉంటుందో ఆఫ్ఘన్ ప్రజలకు చూపుతున్నారు… తాలిబాన్లు. ముఖ్యంగా పంజ్‌షీర్‌ను స్వాధీనం చేసుకున్న తర్వాత… రక్తం ఏరులై పారుతోందా? అన్నట్లుగా ఉంది అక్కడ పరిస్థితి. పంజ్‌షీర్‌లో ఇంటింటి తనిఖీలు చేపట్టి… తమ వ్యతిరేకం అనిపించిన వారిని, మైనార్టీలను నిర్దాక్షిణ్యంగా చంపేస్తున్నారు. ఆఫ్ఘన్ మాజీ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్ సోదరుడు రోహుల్లా సలేహ్‌ను కూడా తాలిబన్లు హతమార్చారు. ఇక, ఇప్పటికే మంత్రివర్గాన్ని కూడా ప్రకటించారు. అయితే, ఇవాళ జరగాల్సిన…