Maldives: ప్రధాని మోడీ లక్షద్వీప్ పర్యటనతో మాల్దీవుల్లో ప్రకంపనలు.. భారత్‌పై అక్కసు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maldives: ప్రధాని నరేంద్రమోడీ లక్షద్వీప్ పర్యటన మాల్దీవుల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. భారత్‌పై, ప్రధాని మోడీపై అక్కడి నేతలు అక్కసు వెళ్లగక్కుతున్నారు. ఇటీవల మాల్దీవుల్లో చైనా అనుకూల మహ్మద్ మొయిజ్జూ అధ్యక్షుడిగా గెలిచాడు. ఇతని నేతృత్వంలోని ప్రభుత్వం భారత్ వ్యతిరేక చర్యల్ని అవలంభిస్తోంది. ఇదే కాకుండా అక్కడ ఉన్న 77 మంది భారత సైనికులను వెళ్లాలని ఆదేశిస్తోంది. మరోవైపు మొయిజ్జూ చైనాలో పర్యటించే పనిలో ఉన్నారు.
ప్రస్తుతం లక్షద్వీప్ పర్యటనను ఉద్దేశిస్తూ మాల్దీవుల మంత్రి చేసి ట్వీట్ సోషల్ మీడియాలో దుమారాన్ని రేపుతోంది. 32 చ.కి.మీ విస్తీర్ణంలో 36 దీవులతో కూడిన లక్షద్వీప్‌లో పర్యటకాన్ని ప్రోత్సహించేందుకు ప్రధాని పర్యటన చేయడం ఆ దేశానికి నచ్చడం లేదు. మాల్దీవులు ఎంపీ జాహీద్ రమీజ్ తన అక్కసును వెళ్లగాక్కారు. తన ట్వీట్ లో ‘‘ భారత్ మాల్దీవులను లక్ష్యంగా చేసుకుంటోందని ఆరోపించారు. బీచ్ టూరిజంలో మాల్దీవులతో పోటీపడటంలో భారత్ అనేక సవాళ్లను ఎదుర్కొంటుంది’’ అని అన్నారు. అంతే కాకుండా ‘‘పర్యాటకంలో మాతో పోటీ పడాలన్న ఆలోచన భ్రమే (ప్రధాని పర్యటన వీడియోను ట్యాగ్ చేస్తూ). మా దేశం అందించే సర్వీస్‌ను ఎలా అందించగలరు? పరిశుభ్రంగా ఎలా ఉంచగలరు?అక్కడి గదుల్లో వచ్చే వాసన అతి పెద్ద సమస్య’’ అని ట్వీట్ చేశారు.
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Supreme Court: సీజేపీ నిరసనలపై సుప్రీంకోర్టు సీరియస్.. ఆదివారం ప్రత్యేక విచారణ..
- Earthquake: ఉత్తరాఖండ్‌లో భూప్రకంపనలు.. ప్రజలు పరుగులు
Read Also: Viral News : ఈ హ్యాండ్ బ్యాగ్ కొనే బదులు..ఢిల్లీలో వందల ప్లాట్లు కొనుక్కోవచ్చు
లక్షద్వీప్‌లో ప్రధాని మోడీ స్నార్కెలింగ్ ఫోటోలు వైరల్ అయిన తర్వాత మాల్దీవుల మంత్రి మరో ట్వీట్ చేశారు. ఆ దేశ యూత్ ఎంపవర్మెంట్ డిప్యూటీ మినిస్టర్ మరియం షియూనా ప్రధాని మోడీని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. మోడీని తోలుబొమ్మ అని కామెంట్ చేశారు. అయితే దీనిపై తీవ్ర వ్యతిరేకత రావడంతో ఈ ట్వీట్‌ని డిలీట్ చేశాడు.
మయిజ్జూ ప్రభుత్వంలోని నేతలు ఇలా ప్రధాని మోడీని కామెంట్ చేయడాన్ని ఆ దేశ మాజీ అధ్యక్షుడు మహ్మద్ నషీద్ ఆదివారం ఖండించారు. మంత్రి మరియం షియనా ఉపయోగించిన భాష భయంకరంగా ఉందని, భారత్ మన మిత్రుడని అన్నారు. అధ్యక్షుడు మయిజ్జూ ఇలాంటి వ్యాఖ్యలకు దూరంగా ఉండాలని సూచించారు. అయితే మాల్దీవుల తీరుపై భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాయ్‌కాట్ మాల్దీవులు అంటూ పోస్టులు పెడుతున్నారు.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!