తమిళ నటుడు మన్సూర్ అలీ ఖాన్ రీసెంట్ గా ‘లియో’ మూవీపై మాట్లాడుతూ.. లియో చిత్రంలో త్రిష నటిస్తున్నారని నాకు తెలిసింది. నేను కూడా ఈ సినిమాలో నటిస్తున్న అయితే త్రిషతో నేను చేసే సన్నివేశాలలో ఒక్క సన్నివేశం అయినా బెడ్‌రూమ్ సీన్ ఉంటుందని నేను అనుకున్నా. నా మునుపటి సినిమాల లాగానే ఈ సినిమాలో కూడా త్రిషను బెడ్రూమ్ కి తీసుకెళ్లవచ్చని నేను అనుకున్నాను. కానీ అలా జరగలేదు. నేను ఇంతకుముందు చాలా సినిమాల్లో చాలా రేప్ సీన్లు చేశాను. రేప్ సీన్లు నాకు కొత్త కాదు. కానీ కశ్మీర్‌లో షూటింగ్ జరుగుతున్నప్పుడు సెట్స్‌లో త్రిషను కనీసం నాకు చూపించలేదు. అంటూ మన్సూర్ కామెంట్స్ చేశారు. దీంతో ఈ వార్తలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి.మన్సూర్ ఆలీ ఖాన్ చేసిన అనుచిత వ్యాఖ్యలు చిత్ర పరిశ్రమలో తీవ్ర దుమారం రేపుతున్నాయి.మరోవైపు ఈ ఘటనపై త్రిష కూడా ఎంతో ఘాటుగా స్పందించింది. మన్సూర్ అలీ ఖాన్ నా గురించి నీచంగా ఎంతో అసహ్యంగా మాట్లాడిన వీడియో నేను చూసాను.. నేను దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇది లైంగికంగా,స్త్రీ ద్వేశపూరితంగా, అసహ్యకరమైనదిగా నాకు అనిపిస్తోంది.ఇలాంటి వ్యక్తి వల్ల మానవాళికి చెడ్డపేరు వస్తుంది. అంటూ త్రిష ట్విట్టర్‌లో రాసుకొచ్చింది.
ఇదిలా ఉంటే మన్సూర్ ఆలీఖాన్ మంగళవారం చెన్నైలో ప్రెస్‌మీట్ ఏర్పాటు చేసి మాట్లాడారు. ‘నాపై తాత్కాలిక నిషేధం విధించి నడిగర్ సంఘం పెద్ద తప్పు చేసింది. నా నుంచి కనీస వివరణ కోరకుండా నిషేధం ఎలా విధిస్తుంది.. నేను ఏ తప్పూ కూడా మాట్లాడలేదు. నేను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదు. ఈ విషయంలో నేను క్షమాపణలు చెప్పేదీ లేదు. నడిగర్ సంఘానికే నేను నాలుగు గంటలు టైమ్ ఇస్తున్నా. నాపై విధించిన తాత్కాలిక నిషేధాన్ని ఎత్తివేయాలి’ అని వార్నింగ్ కూడా ఇచ్చారు.ఈ నేపథ్యంలో మన్సూర్‌పై చెన్నై పోలీసులు తాజాగా ఎఫ్‌ఐఆర్ ను నమోదు చేశారు.చెన్నైలోని థౌజండ్ లైట్స్ ప్రాంతంలో గల మహిళా పోలీస్ స్టేషన్ లో నటుడు మన్సూర్ పై లైంగిక వేధింపులు సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసారు.. జాతీయ మహిళా కమిషన్ ఫిర్యాదు మేరకు నటుడిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. ఈ మేరకు ముందుగా అతడికి నోటీసులు పంపనున్నట్లు కూడా వెల్లడించారు