Under 19 Asia Cup: జపాన్‌కు ఇచ్చిపడేసిన భారత్.. అమన్ అజేయ సెంచరీ
- యూఏఈ వేదికగా జరుగుతున్న అండర్-19 ఆసియా కప్
- భారత్, జపాన్ మ్యాచ్ లో
- జపాన్‌కు ఇచ్చిపడేసిన భారత్..
- అమన్ అజేయ సెంచరీ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Under 19 Asia Cup Mohamed Amaan Century: యూఏఈ వేదికగా జరుగుతున్న అండర్-19 ఆసియా కప్ ఎనిమిదో మ్యాచ్‌లో భారత్, జపాన్‌తో తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చిన టీమిండియా పూర్తిగా సద్వినియోగం చేసుకుని భారీ స్కోరు చేసింది. భారత్ 50 ఓవర్లలో 339/6 స్కోరు చేసింది. ఈ సమయంలో కెప్టెన్ మహ్మద్ అమన్ అజేయ సెంచరీ సాధించాడు. ఇతడితో పాటు మరో ఇద్దరు ఆటగాళ్లు అర్ధ సెంచరీలు చేసారు. దింతో 340 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ జపాన్ కు అందించింది.
Also Read: Suman Kumar: హ్యాట్రిక్‌తోపాటు పది వికెట్లు తీసి సంచలనం సృష్టించిన సుమన్ కుమార్
Also Read
- Mohammad Kaif: గంభీర్.. యువ ఆటగాళ్ల జీవితాలను నాశనం చేస్తున్నావ్..!
- Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
- Electricity Meter Red Light Blinking: కరెంట్ బిల్లు భారీగా వస్తుందా? మీటర్ ముందే ఇచ్చే సంకేతం ఇదే.. కచ్చితంగా తెలుసుకోండి..
- RBI Repo Rate Hike: హోమ్, కార్ లోన్లు ఉన్నవారికి బిగ్ షాక్.. రెపో రేటు పెంచిన ఆర్బీఐ.. సామాన్యులపై తీవ్ర భారం..
ఈ మ్యాచ్‌లో జపాన్ టాస్ గెలిచి భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. తదనుగుణంగా ఆయుష్ మహాత్రే, వైభవ్ సూర్యవంశీ మరోసారి టీమ్ ఇండియాకు మంచి ఓపెనింగ్ పార్టనర్షిప్ ను అందించారు. పాకిస్థాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో శుభారంభం అందించడంలో విఫలమైన ఈ జోడీ జపాన్‌పై తొలి వికెట్‌కు 65 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. కానీ, వైభవ్ సూర్యవంశీ శుభారంభాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. పాకిస్థాన్‌పై ఒక్క పరుగుకే ఔటైన వైభవ్ సూర్యవంశీ జపాన్‌పై 23 పరుగులు చేశాడు.
Also Read: IPS officer: విషాదం.. పోస్టింగ్‌కి వెళ్తుండగా యువ ఐపీఎస్ అధికారి మృతి..
ఇక ఈ ఇన్నింగ్స్ లో ఆయుష్ మ్హత్రే 54 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఇక మూడో స్థానంలో వచ్చిన ఆండ్రీ సిద్ధార్థ్ 35 పరుగుల వద్ద పెవిలియన్ చేరగా, ఆ తర్వాత వచ్చిన కేపీ కార్తికేయ 49 బంతుల్లో 57 పరుగులు చేశాడు. ఓ దశలో భారత్ 46 ఓవర్లు ముగిసే సరికి 6 వికెట్ల నష్టానికి 289 పరుగులు చేసింది. అయితే, ఆ తర్వాత హార్దిక్ రాజ్, మహ్మద్ అమన్ చివరి 4 ఓవర్లలో 50 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. చివరగా.. మహ్మద్ అమన్ 118 బంతుల్లో 7 ఫోర్లతో అజేయంగా 122 పరుగులు చేయగా, హార్దిక్ రాజ్ 12 బంతుల్లో 25 పరుగులు చేశాడు. జపాన్ తరఫున కీఫర్ యమమోటో-లేక్, హ్యూగో కెల్లీ చెరో 2 వికెట్లు, ఆరవ్ తివారీ, చార్లెస్ హింజ్‌లు తలో వికెట్ తీశారు.
తాజావార్తలు
-
Mohammad Kaif: గంభీర్.. యువ ఆటగాళ్ల జీవితాలను నాశనం చేస్తున్నావ్..!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Electricity Meter Red Light Blinking: కరెంట్ బిల్లు భారీగా వస్తుందా? మీటర్ ముందే ఇచ్చే సంకేతం ఇదే.. కచ్చితంగా తెలుసుకోండి..
-
Bhuvneshwar Kumar Comeback: అగార్కర్ హయాంలో భువనేశ్వర్‌కు ఎందుకు చోటు దక్కలేదు?
-
RBI Repo Rate Hike: హోమ్, కార్ లోన్లు ఉన్నవారికి బిగ్ షాక్.. రెపో రేటు పెంచిన ఆర్బీఐ.. సామాన్యులపై తీవ్ర భారం..
ట్రెండింగ్
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!