Samosa: సమోసాల్లో కండోమ్‌లు, గుట్కాలు.. అవి తిన్న వారికి..?!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పూణేలోని ఓ ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ క్యాంటీన్ లో వడ్డించే సమోసాలలో కండోమ్లు, గుట్కా, రాళ్లు లభ్యమైన ఘటన సంచలనం సృష్టించింది. ఈ ఘటన మహారాష్ట్రలోని పూణెలోని పింప్రి-చించ్వాడ్ లో చోటుచేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు రహీం షేక్, అజర్ షేక్, మసర్ షేక్, ఫిరోజ్ షేక్, విక్కీ షేక్ అనే ఐదుగురిపై కేసు నమోదు చేశారు. క్యాటలిస్ట్ సర్వీస్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఆటోమొబైల్ సంస్థ క్యాంటీన్ కు స్నాక్స్ ను సరఫరా చేస్తోంది. అయితే తాజాగా సమోసాల సరఫరా కాంట్రాక్టును మనోహర్ ఎంటర్ ప్రైజెస్ అనే మరో సబ్ కాంట్రాక్టు సంస్థకు కేటలిస్ట్ కంపెనీ అప్పగించింది. ఈ సబ్ కాంట్రాక్టు సంస్థ సరఫరా చేసిన సమోసాల్లో కండోమ్స్, గుట్కా, రాళ్లు లభ్యమయ్యాయి. దీంతో ఆటోమొబైల్ సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Also Read: Unstoppable 4: బాలయ్య మళ్లీ వస్తున్నాడు గెట్ రెడీ
Also Read
- Biscuit Recipe: ఓవెన్ అవసరం లేదు.. కడాయితోనే బేకరీ స్టైల్ బిస్కెట్లు ఇంట్లోనే.. తయారీ విధానం చాలా ఈజీ!
- Supreme Court: నిందితులకు భయం పుట్టించాలి.. అత్యాచార కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
- First Time In Cricket History: క్రికెట్ హిస్టరీలోనే మొదటి సారి.. బాల్ సిక్స్ వెళ్లినా 5 రన్స్ మాత్రమే..
- 2027 World Cup: ప్రపంచ కప్‌లో ఆడే టాప్ 6 ఆటగాళ్లు వీరే.. ఆకాశ్ చోప్రా అంచనా ఇలా..
విచారణలో మనోహర్ ఎంటర్ప్రైజెస్ లో పనిచేస్తున్న ఫిరోజ్ షేక్, విక్కీ షేక్ లు సమోసాలలో కండోమ్లు, గుట్కా, రాళ్లు నింపినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో పోలీసులు వారిని ప్రశ్నించారు. మనోహర్ ఎంటర్ప్రైజెస్ పరువు తీసేందుకే అలా చేశామని నిందితులు అంగీకరించారు. నిందితులు ఎస్ఆర్ఎ ఎంటర్ప్రైజెస్ అనే మరో కంపెనీ ఉద్యోగులని, గతంలో కాంట్రాక్టు పద్ధతిలో చిరుతిళ్లను సరఫరా చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఆహారంలో కల్తీ చేసిన వారిపై, అలా నియమించిన వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించి తదుపరి విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.
Also Read: Unstoppable 4: బాలయ్య మళ్లీ వస్తున్నాడు గెట్ రెడీ
ఇకపోతే సదరు సమోసాలు తిని అస్వస్థతకు గురైన ఆ కంపెనీ ఉద్యోగులను వారి యాజమాన్యం ఆస్పత్రికి తరలించి చికిత్స ఇప్పించింది. ఇకపోతే, ప్రస్తుతం వారి పరిస్థితి బాగానే ఉన్నట్లు తెలియడంతో అంతా ఊపిరి తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన విషయం వైరల్ కావడంతో.. ఇలా తినే తిండి పదార్థాలలో అలాంటి వస్తువులు పెట్టడం ఏంటని సోషల్ మీడియాలో తెగ విమర్శలు వస్తున్నాయి. చూడాలిమరి ఈ విషయంపై అక్కడి అధికారులు ఎలాంటి చర్యలు చేపడతారో.
తాజావార్తలు
-
Biscuit Recipe: ఓవెన్ అవసరం లేదు.. కడాయితోనే బేకరీ స్టైల్ బిస్కెట్లు ఇంట్లోనే.. తయారీ విధానం చాలా ఈజీ!
-
Supreme Court: నిందితులకు భయం పుట్టించాలి.. అత్యాచార కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
-
First Time In Cricket History: క్రికెట్ హిస్టరీలోనే మొదటి సారి.. బాల్ సిక్స్ వెళ్లినా 5 రన్స్ మాత్రమే..
-
2027 World Cup: ప్రపంచ కప్‌లో ఆడే టాప్ 6 ఆటగాళ్లు వీరే.. ఆకాశ్ చోప్రా అంచనా ఇలా..
-
Harish Rao: సామాన్యుడిపై ధరల భారం.. ప్రభుత్వం నిద్రమత్తులో ఉందా?
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?