ఈ ఏడాది జూలై – ఆగస్ట్ నెలల్లో ఒలింపిక్స్ క్రీడలు పారిస్ వేదికగా జరుగనున్నాయి. జూలై 26 2024న ఈ విశ్వక్రీడలు అంగరంగ వైభవంగా మొదలుకాబోతున్నాయి. మొత్తం పదిహేను రోజుల పాటు అనగా ఆగష్టు 11 వరకు ఒలింపిక్స్ గేమ్స్ జరుగనున్నాయి. ఇక ఒలింపిక్స్ క్రీడల్లో భారత జట్టు తరుపున జాతీయ పతాకధారిగా టేబుల్ టెన్నిస్ ప్లేయర్ ఆచంట శరత్ కమల్ వ్యవహరించబోతుండగా.. ఫ్లాగ్ బేరర్ గా శరత్‌కమల్‌ను భారత ఒలింపిక్స్ అసోషియేషన్ తెలిపింది.
Also Read: Instagram: మళ్లీ నిలిచిపోయిన ఇన్స్టాగ్రామ్.. యూజర్స్ ఆగ్రహం..
ఇక పారిస్ ఒలింపిక్స్ ప్రారంభోత్సవ వేడుకల్లో భాగంగా భారత్ తరుపున జాతీయ పతాకధారిగా శరత్ కమల్ కనిపించబోతున్నాడు. ఇక ఆచంట శరత్ కమల్ కు 5 వ ఒలింపిక్స్. ఇక ఇదే తన చివరి ఒలింపిక్స్ క్రీడలు అని శరత్ కమల్ ఇదివరకే ప్రకటించాడు. తాను పాల్గొనబోయే చివరి ఒలింపిక్స్ లో దేశం తరుపున ఫ్లాగ్ బేరర్ గా వ్యవహరించడం చాలా గౌరవంగా భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నాడు. 2022 కామెన్‌వెల్త్ గేమ్స్ ముగింపు వేడుకల్లో కూడా భారత పతాకధారిగా ఈయన వ్యవహరించాడు. ఇప్పటి వరకు ఈయన కామన్ వెల్త్ గేమ్స్ లో 3 గోల్డ్ మెడల్స్ అందుకున్నాడు. కాకపోతే ఒలింపిక్స్ లో మాత్రం ఇప్పటివరకు బోణి కొట్టలేదు.
Also Read: PM Modi: భూటాన్ పర్యటనకు ప్రధాని మోడీ.. ఆ అంశాలపై కీలక చర్చ..
అలాగే దిగ్గజ బాక్సర్ మేరీకోమ్ భారత ఒలింపిక్ టీమ్ హెడ్ గా నియమితురాలైంది. ఈమెను చెఫ్ డి మిషన్ గా భారత ఒలింపిక్ అసోసియేషన్ తెలిపింది. మెంటర్‌గా, గైడ్ గా భారత టీమ్ కు మేరీ కోమ్ వ్యవహరిస్తుందని, ఆమె సంపాదించిన అనుభవం, సలహాలు జట్టుకు ఎంతగానో ఉపయోగపడతాయని ఒలింపిక్ అసోసియేషన్ ప్రకటనలో తెలిపింది. మేరీ కోమ్ ఆరు సార్లు వరల్డ్ ఛాంపియన్‌గా, 2012 ఒలింపిక్స్ లో కాంస్య పతకం గెలిచింది.