Bike Parking: నేటి కాలంలో బైక్ ప్రతి ఒక్కరికీ తప్పనిసరి. ప్రతి ఒక్కరికి ప్రయాణం చేయాలంటే బైక్ ఉండాల్సిందే. ఆఫీస్ అయినా.. ఊరికి వెళ్లాలన్నా, ప్రతి చిన్న విషయానికి మనం బైక్ ను వాడాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే, బైక్‌ను కలిగి ఉన్న ప్రతి ఒక్కరికీ దానిని సురక్షితంగా పార్క్ చేసే సౌకర్యం కావాల్సిందే. ఇంట్లో అయితే ఖాళీ స్థలాల్లో పార్కింగ్ చేసుకుంటాము. మరి.. ఒక్కోసారి ఎక్కువ దూరం ప్రయాణించాల్సి వస్తే.. ఏదైనా పనిమీద వెళ్లినప్పుడు.. బైక్ పార్కింగ్ కోసం స్థలాన్ని వెతుక్కోవల్సిన పరిస్థితి. ఎంత జాగ్రత్తగా పార్కింగ్ చేసిన కూడా.. కొంతమంది వాహనాలపై కన్నేసేవారు ఉంటారు. అదే నండి దొంగలు. అలా ఎక్కడి పడితే అక్కడ పార్కింగ్ చేసి మనపని ముగించుకుని వచ్చేసరికి బైక్ మాయమైందనుకోండి మన గుండె ఆగినంత పని అవుతుంది. బైక్ లపై కన్నేసిన ఓ దొంగ నిర్మానుష్య ప్రదేశాల్లో పార్క్ చేసేవాటిన కాకుండా.. రద్దీగా ఉండే ప్రదేశాల్లో పార్కింగ్ చేసిన వాటిని ఇట్టే మాయం చేస్తున్నాడు. అలాంటి ఓ దొంగను పోలీసులు పట్టుకున్నారు. ఈఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటుచేసుకుంది.
Read also: Arvind Kejriwal : లాకప్ లో ఉన్న కేజ్రీవాల్ ఏమి తిన్నారో తెలుసా ?
యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌లో పార్క్ చేసి విక్రయిస్తున్న ఓ దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. అతనిని విచారించగా పోసులు షాక్ తిన్నారు. ఆ దొంగ ఒకటి కాదు చాలనే బైక్ లను దొంగలించి, తక్కువ డబ్బుకు అమ్మినట్లు గుర్తించారు. అతినిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ ఘటనపై భువనగిరి డీసీపీ రాజేష్ చంద్ర మాట్లాడుతూ.. బీబీనగర్ మండలం కొండ మడుగు గ్రామానికి చెందిన కుతాడి బానుచందర్ పార్క్ చేసిన బైక్ లను దొంగిలించి తక్కువ ధరకు ఇతరులకు విక్రయిస్తున్నట్లు తెలిపారు. అయితే.. ఇలా చోరీ చేసి తక్కువ ధరకు విక్రయిస్తూ.. బానుచందర్ నుంచి మరో 26 బైక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఆయా ప్రాంతాల్లో బైక్ పోగొట్టుకున్న బాధితులంతా పోలీస్ స్టేషన్లకు పరుగులు తీస్తున్నారు. మా బండి పోయిందని ఫిర్యాదులు ఇస్తున్నారు. కాగా, సీజ్ చేసిన బైక్‌లను పేపర్ల ఆధారంగా బాధితులకు తిరిగి అందజేస్తామని పోలీసులు తెలిపారు. కాగా, బైక్‌లు ఎక్కడ పార్క్ చేసినా అజాగ్రత్తగా పార్క్ చేయరాదని పోలీసులు తెలిపారు. మరి.. ఇలాంటి దొంగతనాలు చేస్తే ఈరోజు కాకపోతే ఏదో ఒక రోజు దొరికిపోతారని.. ఇలాంటి పనులు మానుకోవాలని హెచ్చరిస్తున్నారు.
AP Elections 2024: ఎన్నికల కోడ్.. సోషల్ మీడియా పోస్టులపై ప్రత్యేక నిఘా..