నేటి నుంచి రెండో విడత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. తొలి విడత బడ్జెట్ సమావేశాలు జనవరి 31న ప్రారంభమై.. ఫిబ్రవరి 13న ముగిశాయి. ఇక ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇక సోమవారం నుంచి రెండో విడత బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మార్చి 10 నుంచి ఏప్రిల్ 4 వరకు ఈ సమావేశాలు జరగనున్నాయి.
Priyanka Gandhi: కేరళలోని వాయనాడ్‌లో జరగనున్న లోక్‌సభ ఉప ఎన్నిక కోసం కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ నవంబర్ 3 నుంచి మళ్లీ ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. నవంబర్ 3న ప్రియాంక గాంధీ తన సోదరుడు, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో కలిసి బహిరంగ సభల్లో ప్రసంగిస్తారు. ప్రియాంక గాంధీ వయనాడ్ పర్యటన గురించి శుక్రవారం సమాచారం ఇస్తూ.. నవంబర్ 7 వరకు కేరళలో ఉంటారని కాంగ్రెస్ తెలిపింది. ఈ సందర్భంగా ఆమె ఎన్నికల ప్రచారంతో పాటు…
Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో రైల్ రెండవ దశ ప్రాజెక్ట్ కు లైన్ క్లియర్ అయింది. సిటీ విస్తరిస్తున్న కొద్దీ ట్రాఫిక్ రద్దీ పెరగటంతో ఇప్పుడున్న మెట్రోను ఇతర మార్గాలకు విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. అందుకు సంబంధించిన డీపీఆర్ కు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా రూ.24269 కోట్ల అంచనాలతో చేపట్టే మెట్రో రెండో దశకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం రాగానే పనులు మొదలు పెట్టి రాబోయే నాలుగు సంవత్సరాలలో పూర్తి చేయాలని…
ఢిల్లీలో గాలి కాలుష్యం పెరుగుతుంది. ఈ క్రమంలో.. రెండవ దశ GRAP (గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్) అమలు చేశారు. సోమవారం సాయంత్రం సెంట్రల్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కమిషన్ ఏర్పాటు చేసిన గ్రేప్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. GRAP యొక్క రెండవ దశలో ఉన్న ఆంక్షలలో పార్కింగ్ రేట్లను పెంచడం, మెట్రో బస్సుల ఫ్రీక్వెన్సీని పెంచడం వంటి నిబంధనలు ఉన్నాయి.
జమ్మూ కాశ్మీర్‌లో రెండో విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. దాదాపు సాయంత్రం 5 గంటల వరకు 54 శాతం పోలింగ్ నమోదైంది. రెండో దశలో 26 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి.
రెండో విడతలో 75 అన్న క్యాంటీన్లను కూటమి ప్రభుత్వం ప్రారంభించింది. సెక్రటేరీయేట్ సమీపంలోని అన్న క్యాంటీన్‌ను సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభించారు. రెండో విడత అన్న క్యాంటీన్ల ప్రారంభోత్సవంలో మంత్రి నారాయణ, తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్, గుంటూరు జెడ్పీ ఛైర్ పర్సన్, గుంటూరు జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. అన్న క్యాంటీన్లల్లో టోకెన్లు తీసుకుని పేదలకు ఇచ్చారు సీఎం చంద్రబాబు. అనంతరం.. సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణ పేదలకు భోజనం వడ్డించారు.
సీఎం కేసీఆర్ రెండో విడత ఎన్నికల ప్రచారం రేపటి నుంచి ప్రారంభం కానుంది. మూడు రోజుల బ్రేక్ తర్వాత మళ్ళీ కేసీఅర్ ఎన్నికల ప్రచారం స్టార్ట్ కానుంది. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్ ప్రజా ఆశీర్వాద సభలకు హాజరై.. అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. నవంబర్ 9న నామినేషన్లు వేసి కామారెడ్డిలో సభతో ఆ విడత షెడ్యూల్ పూర్తి చేశారు. తాజాగా మళ్లీ రేపటి నుంచి ప్రచారానికి రెడీ కానున్నారు.
కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర తొలి దశకు విశేష స్పందన లభించిన తర్వాత, ఇప్పుడు గుజరాత్ నుంచి మేఘాలయ వరకు రెండో దశను ప్లాన్ చేసినట్లు మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే మంగళవారం తెలిపారు.
ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతున్నాయి. నేడు రెండవ విడతలో 55 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల పోలింగ్ కాసేపట్లో ప్రారంభం కానుంది. ఈవిడతలో అధికార బీజేపీకి సానుకూలంగా లేని పరిస్థితి కనిపిస్తోంది. గట్టిపోటీని ఎదుర్కుంటున్నారు అధికార బీజేపీ అభ్యర్ధులు. షాజహాన్ పూర్, రాంపూర్ స్థానాలపైనే అందరి దృష్టి వుంది. 1989 నుంచి షాజహాన్ పూర్ అసెంబ్లీ స్థానానికి ఎమ్.ఎల్.ఏ గా ఎన్నికై, 9 వ సారి కూడా పోటీ చేస్తున్నారు బీజేపీ సీనియర్…