Water Tank Collapse: మహారాష్ట్రలోని పూణె జిల్లాలో ఈరోజు (అక్టోబర్ 24) పెను ప్రమాదం సంభవించింది. పింప్రి చించ్‌వాడ్ లోని భోసారి ప్రాంతంలో వాటర్ ట్యాంక్ కూలిపోవడంతో ముగ్గురు కార్మికులు మరణించారు. అలాగే ఏడుగురు గాయపడ్డారు. ప్రమాదానికి గురైన కార్మికులందరూ బీహార్, జార్ఖండ్ వాసులు. క్షతగాత్రులను ఆస్పత్రిలో చేర్పించారు. ఈ ఘటనపై అదనపు పోలీసు కమిషనర్ వసంత్ పరదేశి స్పందించారు. ఓ నిర్మాణ సంస్థ లేబర్ క్యాంపులో ఈ ఘటన చోటుచేసుకుందని తెలిపారు. ఉదయం ఆరు గంటలకు కార్మికులందరూ వాటర్ ట్యాంక్ దగ్గర స్నానం చేస్తుండగా.. నీటి ఒత్తిడికి ట్యాంక్ ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
Also Read: Korean conflict: సౌత్ కొరియా అధ్యక్షుడి కార్యాలయ పరిసరాల్లో చెత్త బెలూన్.. కిమ్పై ఆగ్రహం
భూమి నుంచి 12 అడుగుల ఎత్తులో వాటర్ ట్యాంక్ నిర్మించినట్లు సమాచారం. ఉదయం కూలి పనులకు వెళ్లే ముందు ట్యాంకు సమీపంలోని కుళాయి వద్ద స్నానం చేసేందుకు కూలీలు వచ్చారు. దీంతో ఒక్కసారిగా ట్యాంకు పగిలి కింద పడిపోవడంతో అక్కడ స్నానం చేస్తున్న కూలీలు కింద పడ్డారు. బీహార్, జార్ఖండ్‌తో పాటు బెంగాల్, ఉత్తరప్రదేశ్ ఇంకా ఇతర రాష్ట్రాల నుండి వెయ్యి మందికి పైగా కార్మికులు ఈ లేబర్ క్యాంపులో నివసిస్తున్నారు. వారం రోజుల క్రితమే కొందరు కూలీలు ఇక్కడికి వచ్చారు. కూలీలు స్నానం చేసేందుకు వాటర్ ట్యాంక్ దగ్గర 25 కుళాయిలు ఏర్పాటు చేశారు. వీటితో పాటు దాదాపు 60 మరుగుదొడ్లు కూడా నిర్మించారు. కూలీలు ఉదయం 8 గంటలకు విధులకు బయలుదేరుతారు.
Also Read: Tecno Pova 6 Neo: ఫ్లిప్‌కార్ట్‌లో క్రేజీ ఆఫర్.. 12 వేలకే ‘టెక్నో పోవా 6 నియో’!
STORY | 3 labourers killed, 7 injured as water tank collapses in Pune
READ: https://t.co/XWerAvIm7E
VIDEO: The incident took place in Bhosari area of Pimpri Chinchwad township when some labourers were taking bath under the water tank. Visuals from the incident site.
(Full… pic.twitter.com/iQYjs99yRa
— Press Trust of India (@PTI_News) October 24, 2024