Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Sports In Ind Vs Ban Test Series Various Records Are Waiting

IND vs BAN: భారత్-బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్‌లో ఈ రికార్డ్స్ బద్దలు కానున్నాయా..?

Published Date :September 12, 2024 , 10:59 am
By Kothuru Ram Kumar
  • సెప్టెంబర్ 19 నుంచి భారత్ - బంగ్లాదేశ్ మధ్య రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ప్రారంభం.
  • ఆటగాళ్లను ఊరిస్తున్న రికార్డ్స్
  • లిస్టులో కోహ్లీ - రోహిత్ - అశ్విన్ లు.
IND vs BAN: భారత్-బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్‌లో ఈ రికార్డ్స్ బద్దలు కానున్నాయా..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

IND vs BAN: సెప్టెంబర్ 19 నుంచి భారత్, బంగ్లాదేశ్ మధ్య రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో తొలి టెస్ట్ మ్యాచ్ చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరగనుంది. రెండో టెస్టు సెప్టెంబర్ 27 నుంచి కాన్పూర్‌ లోని గ్రీన్ పార్క్‌ లో జరగనుంది. తొలి మ్యాచ్‌కి టీమిండియాను ఇప్పటికే ప్రకటించారు. అయితే బంగ్లాదేశ్ ఇంకా జట్టును ప్రకటించలేదు. టెస్టు క్రికెట్ చరిత్రలో రెండు జట్ల మధ్య భారత్‌దే పైచేయి. భారత్, బంగ్లాదేశ్ ల మధ్య మొత్తం 13 టెస్టు మ్యాచ్‌లు జరగగా అందులో భారత్ 11 మ్యాచ్‌లు గెలుపొందగా, రెండు మ్యాచ్‌లు డ్రా అయ్యాయి. ఇంత అద్భుతమైన రికార్డు ఉన్నప్పటికీ, రోహిత్ మరియు బృందం బంగ్లాదేశ్‌ను తేలికగా తీసుకోవడానికి లేదు. దీనికి కారణం ఇటీవల బంగ్లాదేశ్‌ జట్టు 2-0తో పాకిస్థాన్‌ను ఓడించింది. తొలిసారిగా పాకిస్థాన్‌తో టెస్టు సిరీస్‌ను బంగ్లాదేశ్ కైవసం చేసుకుంది. భారత్-బంగ్లాదేశ్ సిరీస్‌కి సంబంధించిన కొన్ని అద్భుతమైన రికార్డుల గురించి ఒకసారి చూద్దాం..

టెస్టులో కోహ్లీ 9 వేల పరుగులు:

భారత క్రికెట్‌ జట్టు స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ విరాట్‌ కోహ్లి టెస్టు క్రికెట్‌లో మరో భారీ మైలురాయిని సాధించే దిశగా దూసుకుపోతున్నాడు. బంగ్లాదేశ్‌తో జరిగే టెస్టు సిరీస్‌లో కోహ్లి 152 పరుగులు చేస్తే, టెస్టు క్రికెట్‌లో 9000 పరుగులు పూర్తి చేసిన నాలుగో భారత బ్యాట్స్‌మెన్‌గా రికార్డులకెక్కాడు. సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, సునీల్ గవాస్కర్ వంటి దిగ్గజాల తర్వాత ఈ ఘనత సాధించిన నాలుగో భారత బ్యాట్స్‌మెన్‌గా విరాట్ కోహ్లీ నిలవనున్నాడు. ప్రస్తుతం కోహ్లి 113 టెస్టుల్లో 8848 పరుగులు చేశాడు.

సెహ్వాగ్‌ని దాటనున్న రోహిత్:

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ మరో రికార్డుకు చేరువలో ఉన్నాడు. బంగ్లాదేశ్‌తో జరిగే టెస్టు సిరీస్‌లో రోహిత్ మరో 7 సిక్సర్లు బాదితే, టెస్టు క్రికెట్‌లో భారత్ తరఫున అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్‌మెన్‌గా వీరేంద్ర సెహ్వాగ్ రికార్డును బద్దలు కొడతాడు. టెస్టు క్రికెట్‌లో భారత్ తరఫున అత్యధిక సిక్సర్లు కొట్టిన రికార్డు ప్రస్తుతం వీరేంద్ర సెహ్వాగ్ పేరిట ఉంది. సెహ్వాగ్ 103 టెస్టుల్లో 90 సిక్సర్లు కొట్టాడు. ఇప్పటివరకు 54 టెస్టులాడిన రోహిత్ 84 సిక్సర్లు బాదాడు.

చ‌రిత్ర సృష్టించ‌డానికి అడుగు దూరంలో అశ్విన్:

ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్‌ లో అత్యధిక సార్లు 5 వికెట్లు తీసిన బౌల‌ర్ గా నిలిచే ఛాన్స్ అశ్విన్ కు ఉంది. బంగ్లాదేశ్‌ తో జరిగే తొలి టెస్టు మ్యాచ్‌లో అశ్విన్ 5 వికెట్లు తీస్తే ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో అత్యధిక సార్లు ఈ ఫీట్ చేసిన బౌలర్‌ గా రికార్డులకెక్కనున్నాడు. ప్రస్తుతం అశ్విన్ ఆస్ట్రేలియా సీనియ‌ర్ స్టార్ స్పిన్నర్ నాథన్ లియాన్‌ తో సమానంగా ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో 10 సార్లు 5 వికెట్లు తీసుకున్న ఘనత సాధించారు. ఇందులో నంబర్-1గా ఉండాలనుకుంటే అశ్విన్ ఇంకా ఒక్కసారి మాత్రమే 5 వికెట్లు తీయాలి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • aswin
  • ind vs ban
  • IND vs BAN Test
  • Rohith Sharma
  • VIRAT KOHLI

తాజావార్తలు

  • Off The Record : ప్రేమ్ సాగర్ రావులో నిరాశ, నిస్పృహలు పెరిగిపోతున్నాయా?

  • Off The Record: ఇంచార్జ్ కోసం పి.గన్నవరం టీడీపీ కేడర్ ఎదురు చూపులు

  • Instagram Love Tragedy: యువతి ప్రాణం తీసిన ఇన్‌స్టా లవ్‌.. ఎలుకల మందు తాగి..!

  • Off The Record: జనసేన కోసం రంగంలోకి ఐప్యాక్ మాజీ టీం..

  • SSC Exam: ‘పది’ విద్యార్థులకు శుభవార్త.. ప్రతి ఒక్కరికీ 7 మార్కులు కలిపేందుకు బోర్డు నిర్ణయం..

ట్రెండింగ్‌

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions