Public Toilet : మనలో చాలామంది ఎప్పుడో ఒకసారి పబ్లిక్ టాయిలెట్ లను ఉపయోగించుకునే ఉంటాము. కాకపోతే అలా వినియోగించినప్పుడు ఎంతసేపు వెళ్లిన ఏమి కాదు. కాకపోతే ఇప్పుడు పబ్లిక్ టాయిలెట్ లోపల ఎవరు ఎంతసేపు దానిని ఉపయోగిస్తున్నారు చెప్పే టైమర్ ను ఎప్పుడైనా గమనించారా.. అవును పబ్లిక్ టాయిలెట్ వద్ద టైమర్ ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా.. అవునండి నిజం. తాజాగా ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పబ్లిక్ టాయిలెట్ వద్ద ప్రతి డోర్ వద్ద టైమర్ ఇన్స్టాల్ చేయడమేంటని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Suresh Gopi: ఇందిరాగాంధీని “భారతమాత” అన్న వ్యాఖ్యలపై కేంద్రమంత్రి వివరణ..
ఇకపోతే ఓ వ్యక్తి పబ్లిక్ టాయిలెట్ లోపలికి వెళ్ళినప్పుడు నుంచి వారు బయటకు వచ్చే సమయం వరకు ఆ టైమర్ రన్ అవుతూనే ఉంటుంది. ఈ సంఘటన పెద్ద దుమారం అవడంతో ప్రజలు దానిని వ్యతిరేకిస్తున్నారు. ఈ సంఘటన పొరుగు దేశం చైనాలో జరిగింది. ఈ విషయాన్ని చూస్తే నిజంగానే చైనా అన్ని పరిమితులను దాటేస్తోంది అంటూ అర్థమవుతుంది. ఈ మధ్యకాలంలో యుంగాంగ్ బౌద్ధ గ్రోటోలలో టాయిలెట్ టైమర్ లను ఇన్‌స్టాల్ చేసింది చైనా. దేశంలోని షాంగ్సీ ప్రావిన్స్‌లోని యుంగాంగ్ బౌద్ధ గ్రోటోస్ ఓ పురాతన బౌద్ధ దేవాలయం. ఆ ప్రాంతంలో 200 కంటే ఎక్కువ గుహలు, వేలాది బుద్ధ విగ్రహాలు ఉన్నాయి. ఇప్పటికే ఆ ప్రదేశానికి యునెస్కో ప్రపంచ వారసత్వ హోదాను కూడా కల్పించింది. ఈ ప్రాంతంలో నిర్మించిన పబ్లిక్ టాయిలెట్లలో టైమర్‌లు అమర్చబడి ఉన్నాయంటూ చెప్పే పోస్ట్ ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతుంది.
Viral News : ఆన్ లైన్లో ఐస్ క్రీమ్ ఆర్డర్ చేస్తున్నారా? ఇది చూస్తే జన్మలో తినరు..
ఇక ఈ విషయంపై అక్కడ ఉన్న ఉద్యోగి చెప్పిన వివరాలు ప్రకారం చూస్తే వర్ణితకులు వచ్చిన సమయంలో బాత్రూంలో అవసరమైన దానికంటే ఎక్కువ సమయం గడుపుతున్నారని నేపథ్యంలో బాత్రూం బయట వారికి ఏదైనా జరిగితే అత్యవసర పరిస్థితి కోసం అటువంటి సమయంలో వారిని సేవ చేయబడతారంటూ చెప్పుకొచ్చాడు. నిన్ను బట్టి చూస్తే కేవలం భద్రత కోసం ఈ టైమర్స్ ఏర్పాటు చేసినట్టుగా అతడు. కాకపోతే ఈ విషయాన్ని చాలామంది వ్యతిరేకిస్తున్నారు.
Hurry up, there's a toilet timer in China
Digital timers show how long you are sitting on the toilet at the Unesco world heritage Yungang Grottoes in Datong city of Shanxi Province in China.#travel #nature #travelgram #wanderlust #FREENBECKYAT9ENT #adventure #travelblogger pic.twitter.com/G8FD9rAMUz
— SHORT TRIPS (@short_tripps) June 12, 2024