ఐస్ క్రీమ్ అంటే ఇష్టపడని వాళ్లు ఉండరు.. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు ఐస్ క్రీమ్ అంటే పడి చచ్చిపోతారు.. అయితే ఈ రోజుల్లో ఐస్ క్రీమ్ తినాలంటే జంకుతున్నారు.. అది కూడా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవాలంటే భయపడుతున్నారు.. ఆన్ లైన్లో ఆర్డర్ పెట్టుకున్న ఫుడ్ లో ఏదొకటీ వస్తున్నాయి.. మొన్నేమో ఐస్ క్రీమ్ లో మనిషి వేలు వచ్చింది.. తాజాగా ఐస్ క్రీమ్ బాక్స్ లో ఏకంగా జర్రీ కనిపించింది.. వివరాల్లోకి వెళితే..
ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో జరిగింది.. నోయిడాకు చెందిన ఓ మహిళ ఆన్‌లైన్‌లో చల్లటి ఐస్‌క్రీమ్ ఆర్డర్ పెట్టింది. ఇక కొద్దిసేపటికి ఆ పార్శిల్ ఇంటికి రానే వచ్చింది. ఓ పట్టు పడదామని ఆ ఐస్‌క్రీమ్ బాక్స్ ఓపెన్ చేయగా అందులో జెర్రి కనిపించింది.. అది చూసి షాక్ అయిన మహిళ దాన్ని వీడియో తీసింది.. అంతేకాదు ఆ వీడియోను సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేసింది.. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
ఈ ఘటన నిన్న జరిగింది.. ఆ సంస్థ ఆమెకు తిరిగి డబ్బులు రీఫండ్ ఇవ్వడమే కాకుండా.. ఈ ఘటనపై ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టింది. అయితే ఆ బ్రాండెడ్ ఐస్‌క్రీమ్ సంస్థ మాత్రం దీనిపై ఇంకా స్పందించలేదని తెలుస్తోంది.. ఈ వీడియో వైరల్ అవ్వడంతో నెటిజన్లు లైకులు, షేర్లతో మరింత ట్రెండ్ చెయ్యడమే కాదు.. కామెంట్స్ కూడా చేస్తున్నారు..