అసమ్మతి దెబ్బకు పదవిని వదులుకున్న పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ ప్రవాస పౌరులను ఉద్దేశించి ఓ వీడియో సందేశంలో ఆయన అమెరికా తీరుపై వ్యాఖ్యలు చేశారు. తన హయాంలో పాకిస్థాన్ లోని సైనిక స్థావరాలను ఉపయోగించుకునేందుకు అనుమతి ఇవ్వాలని అమెరికా కోరినా తాను దానికి తలొగ్గలేదన్నారు. ఇలాంటి విషయాల్లో అమెరికా వత్తిడికి నేను లొంగలేదని ఇమ్రాన్ ఖాన్ స్పష్టం చేశారు. ఆఫ్ఘనిస్థాన్ నుంచి అమెరికా సేనలు వైదొలిగాక, పాక్ సైనిక స్థావరాలను అమెరికా కోరిందని, కానీ తాను అధికారంలో ఉన్నంత వరకు అందుకు ఒప్పుకోలేదని అన్నారు.
“ఆఫ్ఘనిస్థాన్ లో మళ్లీ ఉగ్రవాదం పేట్రేగితే తక్షణమే స్పందించేందుకు వీలుగా పాక్ లోని సైనిక స్థావరాలను ఉపయోగించుకుంటామని అమెరికా కోరిందన్నారు. కానీ అమెరికా ప్రతిపాదన నాకు సమంజసంగా, దేశ భద్రత నేపథ్యంలో ఆమోదయోగ్యంగా అనిపించలేదన్నారు. ఉగ్రవాదంపై అమెరికా పోరులో 80 వేల మంది వరకు పాకిస్థానీలు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే దేశంలోని గిరిజన ప్రాంతాలు ధ్వంసం అయ్యాయి.
ఇప్పుడు మన సైనిక స్థావరాలు అడుగుతున్నారు. ఇలాంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించలేదన్నారు ఇమ్రాన్ ఖాన్. మరోవైపు ఈ షో సందర్భంగా ఇమ్రాన్ ఖాన్ గాడిదలగురించి చేసిన కామెంట్లపై సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ లు పడుతున్నాయి. ‘గాడిదకు చారలు గీస్తే అది కంచరగాడిద (జీబ్రా) కాలేదు. గాడిద ఎప్పుడూ గాడిదగానే ఉంటుంది’ అని అన్నారు. అంటే తనను తాను గాడిదగా పోల్చుకున్నారని ఇమ్రాన్ ఖాన్ పై ట్రోల్స్ చేస్తున్నారు. అయితే ఇమ్రాన్ మాత్రం వితౌత్ కామెంట్ అని తప్పించుకున్నారు.
Pawan Kalyan: నేను సింగిల్‌గా రావాలని చెప్పడానికి వైసీపీ వాళ్లెవరు?