అసమ్మతి దెబ్బకు పదవిని వదులుకున్న పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ ప్రవాస పౌరులను ఉద్దేశించి ఓ వీడియో సందేశంలో ఆయన అమెరికా తీరుపై వ్యాఖ్యలు చేశారు. తన హయాంలో పాకిస్థాన్ లోని సైనిక స్థావరాలను ఉపయోగించుకునేందుకు అనుమతి ఇవ్వాలని అమెరికా కోరినా తాను దానికి తలొగ్గలేదన్నారు. ఇలాంటి విషయాల్లో అమెరికా వత్తిడికి నేను లొంగలేదని ఇమ్రాన్ ఖాన్ స్పష్టం చేశారు. ఆఫ్ఘనిస్థాన్ నుంచి అమెరికా సేనలు వైదొలిగాక, పాక్ సైనిక…