IMD Rain Alert: ఈ రాష్ట్రాలకు అతి భారీ వర్ష సూచన.. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక
- ఉత్తర భారత రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
- అతి భారీ వర్షాలు కురుస్తాయని వార్నింగ్
- అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ వ్యాప్తంగా రుతుపవనాలు విస్తరిస్తున్నాయి. ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గత వారం నుంచి మహారాష్ట్రలో వర్షాలు దంచికొడుతున్నాయి. తాజాగా కేంద్ర వాతావరణ శాఖ.. ఉత్తర భారత రాష్ట్రాలకు భారీ వర్షాల హెచ్చరిక జారీ చేసింది. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ శాస్త్రవేత్త డాక్టర్ శశికాంత్ తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్లు వెల్లడించారు.
డాక్టర్ శశికాంత్ మాట్లాడుతూ.. ‘‘వాయువ్య భారతదేశంలోని జమ్మూకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ పర్వత ప్రాంతాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి. ఈరోజు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశాం. రేపు కూడా ముఖ్యంగా ఉత్తరాఖండ్‌లోని బాగేశ్వర్, పరిసర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అందుకే అక్కడ కూడా ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుంది.’’ అని తెలిపారు. అలాగే జమ్మూకశ్మీర్‌తో పాటు సమీప ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసినట్లు పేర్కొన్నారు. మైదాన ప్రాంతాల విషయానికి వస్తే.. పంజాబ్, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఒకటి, రెండు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.
Also Read
- Ram Mandir: రామ మందిర ట్రస్ట్‌లో సంచలనం.. చంపత్ రాయ్ రాజీనామా ఆమోదం
- Mumbai: ముంబై, పూణె జలదిగ్బంధం.. వర్ష బీభత్సానికి 13 మంది మృతి
- Dowry harassment: ప్రేమ పెళ్లి చేసుకున్న కట్నం వేధింపులు తప్పలేదు.. 2 నెలలకే నవవధువు మృతి..
- Pahalgam Attack: ఎన్ఐఏ ఛార్జ్‌షీట్‌లో సూత్రధారిగా హఫీజ్ సయీద్.. పాక్ కుట్రపై కీలక విషయాలు
తూర్పు రాజస్థాన్‌లో ఈరోజు నుంచి వర్షాల తీవ్రత మరింత పెరిగే అవకాశముందని ఐఎండీ తెలిపింది. రాబోయే రెండు నుంచి మూడు రోజుల పాటు అక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని డాక్టర్ శశికాంత్ వివరించారు. దేశంలో రుతుపవనాల పురోగతిపై మాట్లాడుతూ.. ‘‘ప్రస్తుతం దేశంలోని దాదాపు అన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించాయి. రాజస్థాన్‌లోని కొన్ని ప్రాంతాలు మాత్రమే ఇంకా మిగిలి ఉన్నాయి. అయితే వచ్చే మూడు రోజుల్లో అక్కడికి కూడా రుతుపవనాలు విస్తరించి, దేశమంతా పూర్తిగా కప్పివేస్తాయి.’’ అని డాక్టర్ శశికాంత్ వెల్లడించారు.
మహారాష్ట్రలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ముంబై, పూణె జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఇక అతి భారీ వర్షాలు కారణంగా ఇప్పటి వరకు 13 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అనవసర ప్రయాణాలు రద్దు చేసుకోవాలని సూచించారు.
#WATCH | Delhi: On the weather conditions, IMD Scientist, Dr Shashi Kant says, "Regarding Northwest India—specifically the mountainous regions of Jammu & Kashmir, Himachal Pradesh, and Uttarakhand—an 'orange' warning for heavy to very heavy rainfall has been issued for Himachal… pic.twitter.com/HNsIR6Hekx
— ANI (@ANI) July 6, 2026
- Tags
- Heavy Rain
- IMD
- Rain Alert
- Warning
తాజావార్తలు
-
IMD Rain Alert: ఈ రాష్ట్రాలకు అతి భారీ వర్ష సూచన.. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక
-
Ram Mandir: రామ మందిర ట్రస్ట్‌లో సంచలనం.. చంపత్ రాయ్ రాజీనామా ఆమోదం
-
Rainy Season Tips : వర్షాకాలంలో వచ్చే రోగాలకు బై..బై.. 5 అద్భుతమైన ఇంటి చిట్కాలు.!
-
Mumbai: ముంబై, పూణె జలదిగ్బంధం.. వర్ష బీభత్సానికి 13 మంది మృతి
-
Nagarjuna: కొడుకు కోసం రంగంలోకి దిగిన కింగ్.. అఖిల్ ‘లెనిన్’ వెనుక నాగార్జున మాస్టర్ ప్లాన్!
ట్రెండింగ్
-
IND Playing XI vs ENG: మూడో టీ20లో ఈ ముగ్గురు ఔట్.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే!
-
Ellyse Perry: లార్డ్స్‌లో ఇంగ్లండ్‌ను ఓడించాం.. ఆ మజానే వేరప్ప.. ఆస్ట్రేలియా అందం ఆనందం!
-
డ్యూయల్ 200MP కెమెరాలు, 8500mAh బ్యాటరలతో ఎంట్రీ ఇవ్వనున్న Xiaomi 18 Pro Max..!
-
Akriti Agarwal: చాలాసార్లు మోసపోయా.. ప్రతి రూమర్ నిజమే.. పృథ్వీ షా కాబోయే భార్య సంచలన వ్యాఖ్యలు!
-
Beth Mooney History: బెత్ మూనీ చరిత్ర.. అరుదైన డబుల్ రికార్డులు.. ధోనీ, రోహిత్, కోహ్లీలకు సాధ్యం కాలే!