IMD 150 Years: భారత వాతావరణ విభాగం (IMD) నేడు (జనవరి 15) న తన 150వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది. వాతావరణ సూచనను అందించే IMD, భారతదేశానికి తన సేవలను అందించడమే కాకుండా.. నేపాల్, మాల్దీవులు, శ్రీలంక, బంగ్లాదేశ్ ఇంకా మారిషస్‌లకు దేశాలకు కూడా ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను అభివృద్ధి చేయడంలో సహాయం చేస్తోంది. ఇది ప్రతికూల వాతావరణంలో ప్రాణనష్టం, ఆస్తి నష్టాన్ని నివారిస్తుంది.
Also Read: Dense Fog: ఢిల్లీని వదలని పొగమంచు.. ఆలస్యంగా నడుస్తున్న 184 విమానాలు..
ఆ రోజు వాతావరణం ఎలా ఉంటుంది? ఎండ ఉంటుందా ? పొగమంచు ఉంటుందా ? వర్షాలు కురుస్తాయా ? ఉష్ణోగ్రతలు ఎలా ఉంటాయి ? ఇలా మొత్తం సమాచారాన్ని అందించే వాతావరణ శాఖ నేటితో 150 ఏళ్లు పూర్తి చేసుకుంది. 1875లో కొన్ని రెయిన్ గేజ్‌లతో ప్రారంభించి, భారత వాతావరణ శాఖ (IMD) నేడు ప్రపంచంలోని అత్యుత్తమ వాతావరణ సంస్థలలో ఒకటిగా నిలిచింది. వాతావరణ అంచనా వేయడంలో ప్రపంచ అగ్రగామిగా అవతరిస్తున్న ఈ విభాగం 150 ఏళ్లు పూర్తి చేసుకుంది. బ్రిటిష్ వారు అధికారికంగా భారతదేశంలో వాతావరణ శాఖకు పునాది వేశారు. 1864లో కలకత్తాను తాకిన వినాశకరమైన తుఫాను, అలాగే 1866, 1871లో రుతుపవనాల వైఫల్యం కారణంగా ఏర్పడిన కరువు దృష్ట్యా, అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం జనవరి 15, 1875న IMDని ఏర్పాటు చేసింది.
ఇకపోతే, రెయిన్ గేజ్ లేదా రెయిన్ గేజ్ అనేది ఒక పరికరం ద్వారా ఒక నిర్దిష్ట ప్రాంతంలో నిర్దిష్ట కాల వ్యవధిలో కురిసిన వర్షాన్ని కొలుస్తారు. వీటిలో చాలా రకాలు ఉన్నాయి. చాలా రెయిన్ గేజ్‌లు కొలత కోసం మిల్లీమీటర్ యూనిట్‌లను ఉపయోగిస్తాయి. భారీ వర్షపాతం విషయంలో అది అంగుళాలు లేదా సెంటీమీటర్లలో కొలుస్తారు. గతంలో భారత వాతావరణ శాఖ పరిమిత వనరులతో అంచనాలు వేసేది. అయితే ఇప్పుడు అమెరికా జాతీయ హరికేన్ సెంటర్ కంటే ఈరోజు మన అంచనా 30 శాతం మెరుగ్గా ఉంది. ప్రస్తుతం IMD అంచనాలు అనేక అభివృద్ధి చెందిన దేశాల కంటే సమానంగా లేదా మెరుగ్గా ఉన్నాయి.
Also Read: TVS Jupiter: అమ్మకాలలో రికార్డ్స్ సృష్టిస్తున్న టీవీఎస్ జూపిటర్
2023 ఏడాది నివేదిక ప్రకారం.. IMD ఇప్పుడు 39 డాప్లర్ వాతావరణ రాడార్లను ఉపయోగిస్తుంది. అంతే కాకుండా, INSAT 3D/3DR ఉపగ్రహాన్ని ఉపయోగించి 15 నిమిషాల క్లౌడ్ అప్‌డేట్‌లను అందిస్తుంది. నేడు IMD వద్ద 806 ఆటోమేటిక్ వాతావరణ స్టేషన్లు, 200 ఆగ్రో-AWS, 5,896 వర్షపాతం పర్యవేక్షణ స్టేషన్లు, 83 మెరుపు సెన్సార్లు అలాగే 63 పైలట్ బెలూన్ స్టేషన్లు ఉన్నాయి. సాంకేతిక రంగంలో, IMD 2015 సంవత్సరంలో వేగవంతమైన వాతావరణ అంచనాను సాధించింది.