NTV Telugu Site icon

KTR: 12 ఎంపీ సీట్లు వస్తే కేసీఆర్ రాష్ట్ర రాజకీయాలను శాసించే రోజు వస్తుంది..

Ktr

Ktr

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం బూత్ కమిటీ సభ్యుల సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మనల్ని ప్రజలు ఓడించలేదు.. మనల్ని మనమే ఓడించుకున్నామని కేటీఆర్ తెలిపారు. మనం కూడా జై శ్రీరామ్ అందాం.. రాముడు అందరివాడు.. రాముడు బీజేపీ ఎమ్మెల్యే కాదు, ఎంపీ కూడా కాదన్నారు. కరీంనగర్ జిల్లాకు ఏం చేశారో చర్చకు సిద్ధమా అని బండి సంజయ్ కు కేటీఆర్ సవాల్ విసిరారు. కరీంనగర్ లో బీజేపీ, బీఆర్ఎస్ కే మధ్య పోటీ అన్నారు. కాంగ్రెస్ తో పోటీ లేదని తెలిపారు. కాంగ్రెస్ పార్లమెంటు అభ్యర్థి ముక్కు మొహం తెలియని వాడిని తీసుకువచ్చి నిలబెట్టారు.. కరీంనగర్ పార్లమెంటుకు జీవన్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి పోటీ చేయాలని ఉండేదన్నారు. రేవంత్ రెడ్డి, బండి సంజయ్ మ్యాచ్ ఫిక్సింగ్ లో కరీంనగర్ కు డమ్మీ అభ్యర్థి నిలబెట్టారని ఆరోపించారు. కాంగ్రెస్ అభ్యర్థికి కండువా లేకుండా తిప్పాపూర్ బస్టాండ్ లో నిలబెడితే ఆ పార్టీ కార్యకర్తలు కూడా గుర్తించరని ఎద్దేవా చేశారు. ఈ ఎంపీ ఎన్నికల్లో 12 సీట్లు బీఆర్ఎస్ కు వస్తే కేసీఆర్ రాష్ట్ర రాజకీయాలను శాసించే రోజు సంవత్సరంలోపు వస్తుందని కేటీఆర్ పేర్కొన్నారు.

Dharmana Prasada Rao: టీడీపీ మేనిఫెస్టోను ప్రజలు సీరియస్‌గా తీసుకోవడం లేదు..

ఉమ్మడి రాజధాని, కేంద్ర పాలిత ప్రాంతం, రాజ్యాంగం మారుస్తాం, డీలిమిటేషన్ లో అన్యాయం జరగవద్దు.. అంటే అడ్డుకునే శక్తి ఒక్క గులాబీ కండువాకే ఉందని కేటీఆర్ పేర్కొన్నారు. 2014లో బడే భాయ్.. 2024లో చోటా భాయ్ మోసం చేశారని ఆరోపించారు. 30 లక్షల కోట్లు రోడ్ సెస్ పేరిట వసూలు చేసి అందులో సగం సొమ్ముతో అంబానీ లాంటి వాళ్లకు రుణమాఫీ చేశారని దుయ్యబట్టారు.
తెలంగాణ పుట్టుకను అవమానించిన వ్యక్తి మోడీ అని మండిపడ్డారు. పదేళ్లలో ప్రజలను మోసం చేసినవాడు నరేంద్ర మోడీ అని అన్నారు.

India Women vs Bangladesh Women: టీమిండియా స్పీడ్ ను బంగ్లాదేశ్ ఆపగలదా.. మొదట బ్యాటింగ్ చేయనున్న టీమిండియా..

మరోవైపు.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అధికారులు మాట వినేవారు.. ఇప్పుడు సుంకరి కూడా పిలిస్తే రావడం లేదు.. మనకు అవమానం కాదా అని ప్రశ్నించారు. వరి పంటకు ఇస్తానన్న 500 రూపాయల బోనస్ బోగస్ అయింది.. ఆరు హామీలు కావడం లేదని ఆరోపించారు. పార్లమెంటు ఎన్నికల తర్వాత ఉచిత బస్సు ఉచిత విద్యుత్ పథకాలు కూడా మాయం అవుతాయని కేటీఆర్ తెలిపారు.
70 ఏళ్ల వయసులో తుంటి విరిగినా కేసీఆర్ బస్సు యాత్ర పేరిట జనంలో తిరుగుతున్నారు.. తల్లి లాంటి పార్టీకి కష్టం వచ్చినప్పుడు పంచాయతీలు పక్కన బెట్టి ఎండను లెక్క చేయకుండా ముందుకు రావాలని కార్యకర్తలకు సూచించారు. రోజులో ఉదయం గంట, సాయంత్రం గంట కష్టపడితే విజయం మనదే అని కార్యకర్తలకు జోష్ నింపారు. ఫోటోలు దిగి వాట్సాప్ లో ఫోటోలు పెట్టుడు కాదు.. అన్నీ అడగాలన్నారు. అధికార పార్టీకి తొత్తులుగా మారిన అధికారులు, తోకాడిస్తున్న పోలీసులు మళ్ళీ మన మాట వినాలంటే మనకు 10 – 12 సీట్లు రావాలని కేటీఆర్ పేర్కొన్నారు. సంవత్సరంలోగా మళ్ళీ కేసీఆర్ రాష్ట్రాన్ని శాసించే రోజు రావాలంటే.. మన గెలుపే సమాధానం కావాలన్నారు. పంచాయతీలు, పగలు పక్కనపెట్టాలని కేటీఆర్ కార్యకర్తలకు సూచించారు.