Credit Card New Rules: నవంబర్ 15 నుండి అమలులోకి రానున్న క్రెడిట్ కార్డ్ నియమాలలో ఐసీసీఐ బ్యాంక్ గణనీయమైన మార్పులు చేసింది. వీటిలో ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్, యుటిలిటీ చెల్లింపులు, అనుబంధ కార్డ్ ఛార్జీలు, ఇతర సేవలకు సంబంధించిన మార్పులు ఉన్నాయి. ఇందులో భాగంగా.. ఐసిఐసిఐ బ్యాంక్ కాంప్లిమెంటరీ ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్ కోసం కనీస ఖర్చు పరిమితిని త్రైమాసికానికి రూ. 35,000 నుండి రూ. 75,000కి పెంచింది. HPCL సూపర్ సేవర్ వీసా, కోరల్, రూబిక్స్, సఫిరో, అదానీ వన్ సిగ్నేచర్ క్రెడిట్ కార్డ్ వంటి వివిధ ICICI క్రెడిట్ కార్డ్‌లకు ఈ పరిమితి వర్తిస్తుంది. అలాగే ప్రీమియం క్రెడిట్ కార్డ్ హోల్డర్‌లు (రూబిక్స్, సఫిరో, ఎమరాల్డ్ వీసా వంటివి) గరిష్టంగా నెలవారీ రూ. 80,000 వరకు యుటిలిటీ, బీమా చెల్లింపులపై రివార్డ్ పాయింట్‌లను పొందుతారు. ఇతర కార్డ్ హోల్డర్‌లకు ఈ పరిమితిని నెలవారీ ఖర్చు రూ.40,000గా ఉంచారు. ప్రీమియం కార్డ్ హోల్డర్‌లు కిరాణా సామాగ్రిపై రూ. 40,000 వరకు నెలవారీ ఖర్చులపై రివార్డ్ పాయింట్‌లను పొందగలరు. ఇతర కార్డ్‌ల పరిమితి రూ.20,000గా ఉంది.
Read Also: BSNL Recharge: రోజుకు రూ.3 ల కంటే తక్కువ ఖర్చుతో 300 రోజుల పాటు సేవలు
కార్డ్ హోల్డర్లందరికీ నెలకు రూ. 50,000 వరకు ఇంధన లావాదేవీలపై ఇంధన సర్‌ఛార్జ్‌ను బ్యాంక్ రద్దు చేస్తుంది. ఎమరాల్డ్ మాస్టర్ కార్డ్ మెటల్ క్రెడిట్ కార్డ్ హోల్డర్‌లకు ఈ పరిమితి నెలకు రూ. 1 లక్ష వరకు ఉంది. వార్షిక రుసుము రివర్సల్, టార్గెట్ ప్రయోజనం కోసం ఖర్చు పరిమితిలో అద్దె, ప్రభుత్వ, విద్యా చెల్లింపులు చేర్చబడవు. అలాగే ఎమరాల్డ్, ఎమరాల్డ్ ప్రైవేట్ మెటల్ కార్డ్‌లపై వార్షిక రుసుము రివర్సల్ పరిమితిని రూ.15 లక్షల నుంచి రూ.10 లక్షలకు తగ్గించారు.
Read Also: iQOO 13 Launch: భారత మార్కెట్లోకి ‘ఐకూ 13’.. లాంచ్, ధర డీటెయిల్స్ ఇవే?
ఇకపోతే, ఐసీసీఐ బ్యాంక్ డ్రీమ్ ఫోక్స్ కార్డ్ ద్వారా అందించే స్పా సేవను నిలిపివేసింది. ఈ సదుపాయం సప్ఫిరో, ఎమరాల్డ్, అదానీ వన్ సిగ్నేచర్, ఎమిరేట్స్ ఎమరాల్డ్ కార్డ్ హోల్డర్‌లకు మాత్రమే అందుబాటులో ఉంది. అనుబంధ కార్డ్ హోల్డర్‌లకు ఇప్పుడు రూ. 199 వార్షిక రుసుము వసూలు చేయబడుతుంది. ఇది కార్డ్ వార్షికోత్సవ నెల ప్రకటనలో చేర్చబడుతుంది. CRED, పేటియం, చెక్, MobiKwik వంటి థర్డ్ పార్టీ చెల్లింపు యాప్‌ల ద్వారా చేసే విద్యాపరమైన లావాదేవీలపై 1% ఛార్జీ విధించబడుతుంది. అయితే, కళాశాల లేదా పాఠశాల వెబ్‌సైట్ లేదా POS మెషీన్ ద్వారా చెల్లింపులు చేయడానికి ఎటువంటి ఛార్జీ ఉండదు. ఇది కాకుండా, రూ. 50,000 కంటే ఎక్కువ యుటిలిటీ లావాదేవీలపై 1% సర్‌ఛార్జ్ కూడా విధించబడుతుంది. ఈ కొత్త నిబంధనలన్నీ నవంబర్ 15 నుండి అమలులోకి వస్తాయి. కాబట్టి, ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ హోల్డర్లు ఈ మార్పులను దృష్టిలో ఉంచుకుని తమ ఖర్చులను ప్లాన్ చేసుకోవాలి.