New Zealand Captain Kane Williamson Ruled Out of Netherlands Match: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా సోమవారం హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో న్యూజిలాండ్, నెదర్లాండ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు ముందు న్యూజిలాండ్‌కు భారీ షాక్ తగిలింది. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కు దూరమైన కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్.. నెదర్లాండ్స్ మ్యాచ్‌కు దూరం అయ్యాడు. కేన్ మామ ఇంకా పూర్తి స్ధాయి ఫిట్‌నెస్ సాధించకపోవడంతో కివీస్ మేనెజ్‌మెంట్ ఈ నిర్ణయం తీసుకుంది.
నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌కు కేన్ విలియమ్సన్ దూరమవుతున్నట్లు న్యూజిలాండ్ హెడ్ కోచ్ గ్యారీ స్టెడ్ ధృవీకరించాడు. అయితే ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కు దూరమయిన పేసర్ లూకీ ఫెర్గూసన్.. నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌కు అందుబాటులోకి రానున్నాడు. ఫెర్గూసన్ నెట్స్‌లో తీవ్రంగా శ్రమించాడు. నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌కు జట్టు సెలక్షన్‌కు అతడు అందుబాటులో ఉంటాడు. సీనియర్ పేసర్ టిమ్ సౌథీ కూడా ప్రాక్టీస్ మొదలపెట్టాడు. సౌథీ చేతి వేలికి నేడు మరోసారి ఎక్స్-రే చేసిన తర్వాత అతడి సెలక్షన్‌పై ఓ నిర్ణయం తీసుకుంటారు.
Also Read: World Cup 2023: క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. 14000లకు పెంచిన భారత్-పాకిస్థాన్ మ్యాచ్ టికెట్లు
అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ 9 వికెట్ల తేడాతో గెలిచిన విషయం తెలిసిందే. కివీస్ బ్యాటర్లు డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర సెంచరీలతో చెలరేగడంతో కివీస్ సునాయాస విజయాన్ని అందుకుంది. సోమవారం హైదరాబాద్ వేదికగా నెదర్లాండ్స్‌తో న్యూజిలాండ్ తన రెండో మ్యాచ్‌లో తలపడనుంది. కివీస్ జోరు చూస్తుంటే.. ఈ మ్యాచ్ కూడా గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి.