ICC ODI World Cup 2023 Best Catches So Far: భారత గడ్డపై వన్డే ప్రపంచకప్ 2023 రసవత్తరంగా సాగుతోంది. మెగా టోర్నీలో ఇప్పటికే సగం మ్యాచ్‌లు పూర్తి కాగా.. టాప్ జట్లు కొన్ని సెమీస్ రేసులో లేవు. భారత్ ఆడిన ఐదు మ్యాచ్‌లలో గెలిచి పాయింట్స్ పట్టికలో అగ్ర స్థానంలో ఉంది. దక్షిణాఫ్రికా (8), న్యూజీలాండ్ (8), ఆస్ట్రేలియా (6) టాప్ 4లో ఉన్నాయి. డిపెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్, దాయాది పాకిస్తాన్ వరుస ఓటములతో సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకున్నాయి. మెగా టోర్నీలో బ్యాటర్లు, బౌలర్లు విజృంభిస్తూ రికార్డులు నమోదు చేస్తుంటే.. ఫీల్డర్లు కూడా అద్భుత క్యాచ్‌లతో ఔరా అనిపిస్తున్నారు.
బ్యాటర్లు, బౌలర్లతో పాటు ఫీల్డర్లు అద్బుతంగా రాణిస్తుండమే కొన్ని జట్లకు వన్డే ప్రపంచకప్ 2023లో కలిసొస్తుంది. ముఖ్యంగా టీమిండియాకు బెస్ట్ ఫీల్డర్ రవీంద్ర జడేజా బాగా హెల్ప్ అవుతున్నాడు. అద్భుత ఫీల్డింగ్‌తో స్టన్నింగ్ క్యాచ్ పట్టి జట్టుకు ఊహించని విధంగా వికెట్స్ అందిస్తున్నాడు. బంగ్లాతో జరిగిన మ్యాచ్‌లో స్టన్నింగ్ క్యాచ్ పట్టి ఔరా అనిపించాడు. ఈ క్యాచ్‌ను ఐసీసీ బెస్ట్ క్యాచ్ అని పేర్కొంది. జడేజా క్యాచ్‌కు సంబందించిన వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో దుషన్ హేమంత, కాగిసో రబాడా, రహ్మత్ షా, జో రూట్, నజముల్ శాంటోలు పట్టిన బెస్ట్ క్యాచ్‌లు కూడా ఉన్నాయి.