ICC Cricket World Cup: భారత్‌తో మ్యాచ్ అంటేనే పాకిస్తాన్ ప్లేయర్స్ వణికిపోతున్నారు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Moin Khan Slams Pakistan players ahead of ICC Cricket World Cup 2023: భారత్‌తో మ్యాచ్ అంటేనే తమ ఆటగాళ్లు వణికిపోతున్నారని పాకిస్తాన్ మాజీ కెప్టెన్ మొయిన్ ఖాన్ పేర్కొన్నాడు. సీనియర్లు ఎవరూ కెప్టెన్ బాబర్ ఆజమ్‌కు సలహాలు ఇవ్వడం లేదన్నాడు. జట్టు సమిష్టిగా ఉన్నట్లు అస్సలు కనిపించలేదని, ఇలా అయితే ప్రపంచకప్ గెలవడం కష్టమే అని మొయిన్ ఖాన్ మండిపడ్డాడు. ఆసియా కప్ 2023 సూపర్-4 మ్యాచ్‌లో భారత్ చేతిలో పాకిస్తాన్ చిత్తుగా ఓడిన విషయం తెలిసిందే. ఏకంగా 228 పరుగుల తేడాతో భారీ ఓటమిని మూటగట్టుకుంది. శ్రీలంక మ్యాచ్‌లోనూ ఓడిపోయి విమర్శల పాలైంది. ఈ నేపథ్యంలో పాక్ జట్టు ప్రదర్శనపై మొయిన్ ఖాన్ స్పందించాడు.
మొయిన్ ఖాన్ తాజాగా మాట్లాడుతూ… ‘కెప్టెన్ బాబర్ ఆజమ్‌కు పాకిస్తాన్ సీనియర్ ప్లేయర్స్ సలహాలు ఇవ్వడానికి భయపడ్డారు. రిజ్వాన్, షాదాబ్, ఫఖర్, షాహిన్.. వీళ్లంతా బాబర్‌కు సలహాలు ఇవ్వలేకపోయారు. జట్టు సమిష్టిగా ఉన్నట్లు అస్సలు కనిపించలేదు. గేమ్ ప్లాన్ గురించి ఆటగాళ్ల మధ్య చర్చలు జరుగుతున్నాయో లేదో అని నాకు అనుమానంగా ఉంది. ఒకవేళ సీనియర్లు సలహాలు ఇచ్చినా.. వాటిని పాటించడం లేదేమో. ఎందుకో తెలియదు కానీ.. భారత్‌తో మ్యాచ్ అంటేనే పాకిస్తాన్ ప్లేయర్స్ వణికిపోతున్నారు’ అని అన్నాడు.
Also Read
- 200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
- Shreyas Iyer: "ఆ ఇద్దరి వల్లే మ్యాచ్ ఓడిపోయాం".. కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు..
- CJP Protest: ఢిల్లీలో హై అలర్ట్.. ఇంటర్నెట్ బంద్, మెట్రో స్టేషన్ల మూసివేత.. రంగంలోకి 35,000 మంది భద్రతా సిబ్బంది
- Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
Also Read: Cops Harass Woman: పార్క్‌లో కూర్చున్న యువతిని లైంగికంగా వేధించి.. డబ్బు వసూలు చేసిన పోలీసులు!
‘తాము ఇచ్చిన సలహాలు పనిచేయకపోతే.. మ్యాచ్ ఫలితం గురించి చింతించక తప్పదనే ఆందోళన సీనియర్లలో కనిపిస్తోంది. ఓ పటిష్టమైన జట్టుతో ఆడుతున్నప్పుడు ఇలాంటి భయాలు సహజమే. అయితే పూర్తి స్థాయిలో శక్తిసామర్థ్యాలు, నైపుణ్యాలు ఆటగాళ్లు ప్రదర్శించాలి. ప్రతికూల ఫలితం వస్తుందనే భయం ఉన్నా.. బాడీ లాంగ్వేజ్‌లో దాన్ని కనిపించకుండా జాగ్రత్త పడాలి. ప్రపంచకప్ ఉంది. ఇప్పటికైనా అందరూ మాట్లాడుకుని ఓ నిర్ణయానికి వస్తే మంచిది’. భారత్‌తో మ్యాచ్ మిగతా మ్యాచ్ లానే ఆడితే ఒత్తిడి అధిగమించొచ్చు’ అని మొయిన్ ఖాన్ సూచనలు చేశాడు. అక్టోబరు 14న భారత్‌తో పాకిస్తాన్ తలపడనుంది.
తాజావార్తలు
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
MS Dhoni: ఐపీఎల్ బెట్టింగ్ కేసు.. ఎంఎస్ ధోనీకి హైకోర్టు నోటీసులు!
-
Shreyas Iyer: “ఆ ఇద్దరి వల్లే మ్యాచ్ ఓడిపోయాం”.. కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు..
-
Saturday Horoscope: శనివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!
-
CJP Protest: ఢిల్లీలో హై అలర్ట్.. ఇంటర్నెట్ బంద్, మెట్రో స్టేషన్ల మూసివేత.. రంగంలోకి 35,000 మంది భద్రతా సిబ్బంది
ట్రెండింగ్
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!