ప్రముఖ పైరసీ వెబ్‌సైట్ ‘ఐబొమ్మ’ (iBOMMA) నిర్వాహకుడు రవి కేసులో తాజాగా సీఐడీ (CID) రంగంలోకి దిగింది. పైరసీ సినిమాలు అందిస్తూనే, చట్టవిరుద్ధమైన బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసినట్లు రవిపై ఆరోపణలు ఉన్నాయి. ఈరోజు పోలీసులు రవిని మూడో రోజు కస్టడీలోకి తీసుకొని విచారించనున్నారు. మొదటి రెండు రోజులు విచారణలో రవి సరిగా సహకరించలేదని సమాచారం. బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసింది డబ్బుల కోసమే అని రవి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. రవికి సంబంధించిన ఖాతాల వివరాలు అందించాలని…