టిక్‌టాక్‌పై అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను మళ్లీ అధ్యక్షుడిగా ఎన్నికైతే టిక్‌టాక్‌ను దేశంలో నిషేధించబోనని డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. చైనాకు చెందిన సోషల్ మీడియా యాప్ టిక్‌టాక్‌ను అమెరికాలో నిషేధం విధించే అవకాశాలపై ఓ మీడియాతో మాట్లాడారు. తాను మళ్లీ అధికారంలోకి వస్తే.. టిక్‌టాక్‌ను దేశంలో నిషేధించబోనని స్పష్టంచేశారు.
ఇది కూడా చదవండి: Russia: నదిలో మునిగి చనిపోయిన భారత వైద్య విద్యార్థుల మృతదేహాలు లభ్యం
సోషల్ మీడియాపై చర్యలకు సంబంధించిన బిల్లును ఇటీవల అమెరికా ప్రతినిధుల సభ ఆమోదించింది. డొనాల్డ్ ట్రంప్ కూడా తొలుత దీనికి పరోక్షంగా మద్దతు పలికారు. అయితే కొన్ని రోజుల క్రితమే టిక్‌టాక్‌లో చేరిన ఆయన.. తాజాగా నిర్ణయాన్ని మార్చుకున్నట్లు న్యూయార్క్ పోస్ట్ కథనం వెలువరించింది. రిపబ్లికన్ పార్టీకి చెందిన ట్రంప్.. అక్కడి మీడియా ప్రతినిధి ఛార్లీ కిర్క్‌తో మాట్లాడుతూ టిక్‌టాక్ అంశంపై స్పందించారు. అధికారంలోకి వస్తే టిక్‌టాక్‌పై నిషేధం విధించబోనని కచ్చితంగా చెప్పగలరా? అని ప్రశ్నించగా.. అందులో సందేహమేముంది? తాను ఎప్పటికీ టిక్‌టాక్‌ను బ్యాన్ చేయబోను అంటూ ట్రంప్ సమాధానమిచ్చారు.
ఇది కూడా చదవండి: Air Canada: గాల్లో ఉండగానే మంటలు.. విమానానికి తప్పిన పెను ముప్పు..
అమెరికాలో టిక్‌టాక్‌ను నిషేధించేందుకు వీలుగా అధ్యక్షుడు బైడెన్ బిల్లును తీసుకొచ్చారు. దీనికి మద్దతుగా 352 మంది ఓటు వేశారు. 65 మంది మాత్రమే వ్యతిరేకించారు. మరోవైపు టిక్‌టాక్ మాతృసంస్థ బైట్ డ్యాన్స్ దాని మెజారిటీ వాటాలను ఉపసంహరించుకోవాలని అమెరికా డిమాండ్ చేస్తోంది. దీనిని ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీ వ్యతిరేకిస్తోంది. జాతీయ భద్రత ప్రమాదంలో పడుతుందని వాదిస్తోంది. ఈ ఏడాది నవంబరులో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న తరుణంలో ట్రంప్ తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. యువతను ఆకర్షించేందుకే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Viral Video: ఇంజన్ లేకుండానే పరుగులు పెట్టిన రైలు.. ఎలాగంటే..!