చేతికి ఉంగరాలు పెట్టుకోవడం అనేది చాలా సాధారణం. ప్రతీ ఒక్కరూ చేతి ఉంగరం పెట్టుకుంటారు. కేవలం అలంకరణ కోసం అనుకుంటే పొరపాటే. 

కొందరు అలంకరణకు ఉంగరం ధరిస్తే మరి కొందరు అదృష్టం కోసం ధరిస్తారు. 

ఉంగరం అదృష్టం, అలంకరణకే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

చేతి వేళ్లకి రాగి ఉంగరాన్ని ధరించడం వల్ల జాయింట్ పెయిన్స్, ఉదర సమస్యలు ఉండవు. అలాగే మన శరీరంలోని రక్తం చాలా ప్యూర్‌గా ఉండేలా చేస్తుందంట.

 వెండి ఉంగరం ధరించడం వలన మానసిక ప్రశాంతత కలుగుతుందట. అలాగే ఒత్తిడిని దూరం చేస్తుందంట.

 ఏ రకమైన ఉంగరం పెట్టుకున్నా, అది మన ఆరోగ్యంపై సానుకూల ప్రభావాన్ని చూపిస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. 

అలానే కొన్ని రకాల ఉంగరాలను పెట్టుకోవడం వల్ల అదృష్టం కలిసి వస్తుందట.