ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై మంత్రులు స్పందిస్తున్నారు. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై మండిపడ్డారు మంత్రి బొత్స. మీడియా, మీడియా సృష్టి గురించి మాట్లాడాలి. వోక్స్ వ్యాగన్ కంపెనీ లో సుమారు 10 కోట్లు ఒక వ్యక్తి కి నమ్మి ఇచ్చాం. అప్పుడు నా మీద ఒక పత్రిక ఎలా రాసిందో, ఎంత క్షోభించానో నాకే తెలుసు అన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. అప్పుడు మేమే స్వయంగా సీబీఐ విచారణ కోరాం.స్కిల్ డెవలప్మెంట్ స్కాం ఉన్నా ఎందుకు చంద్రబాబు ప్రభుత్వం విచారణకు ఆదేశించ లేదు.
Read Also:Namratha: హమ్మయ్య.. మా మహేష్ ను వదిలేశారా.. సంతోషం
చంద్రబాబు నాయుడు కోర్టుల ముందు ముద్దాయిగా నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. చంద్రబాబు దోపిడీ దొంగ అన్నారు బొత్స. బయటపడటం అంత తేలిక కాదు. సైమన్స్ కంపెనీ ఎండార్స్ మెంట్. ఎక్కడ అలసత్వం జరిగింది? ఏ సెక్షన్ ను ప్రభావితం చేయలేక పోయాం అనేది విశ్లేషించుకుంటాం అన్నారు. దీంట్లో ఏముంది?ఈ పార్టీ జగన్ రెక్కల కష్టంతో పుట్టింది వైఎస్సార్ స్ఫూర్తితో వచ్చింది. చంద్రబాబు లాగా మామను వెన్నుపోటు పొడవలేదు. స్కిల్ కుంభకోణంలో చంద్రబాబు పాత్ర ఉంది. పాత్ర ఉందని కచ్చితంగా నిరూపించగలం అని ధీమా వ్యక్తం చేశారు.
Read Also: Sajjala Ramakrishna Reddy: 2019లో దారుణమయిన ఓటమిని మర్చిపోయారా?