టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. 2017 నవంబర్‌లో ఇటలీలో విరుష్క పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ఈ స్టార్ కపుల్ జనవరి 2021లో కుమార్తె వామికకు జన్మనిచ్చారు. కోహ్లీ-అనుష్కలకు 2024 ఫిబ్రవరి 15న కుమారుడు అకాయ్ జన్మించాడు. ప్రస్తుతం కుమార్తె, కుమారుడితో కలిసి అనుష్క లండన్‌లో ఉంటున్నారు. అయితే ఓ ఇంటర్వ్యూలో అనుష్క సంచలన వ్యాఖ్యలు చేశారు.
గతంలో ఓ ఇంటర్వ్యూలో అనుష్క శర్మ మాట్లాడుతూ.. తనను తాను ఓ మంచి తల్లిగా పేర్కొన్నారు. తాను పెళ్లికి ముందే తల్లిని అయ్యా అని చెప్పుకొచ్చారు. ‘నేను పెళ్లికి ముందే తల్లిని అయ్యా. ఇదంతా రణబీర్ కపూర్ వల్లే. సినిమా షూటింగ్ సమయంలో రణబీర్ మేకప్ రూమ్‌కి వచ్చి.. నా బ్యాగ్ మొత్తం వెతికేవాడు. నేను ఫోన్‌లో ఏదో చూస్తుంటే.. నా వద్దకు వచ్చి చిలిపి పనులు చేసేవాడు. అతడి అల్లరి, చిలిపి పనులను నేను తట్టుకున్నా. చిన్నపిల్లాడు రణబీర్ అల్లరిని భరించినప్పటి నుంచి నాలో మంచి తల్లి ఉందని గ్రహించా’ అని అనుష్క పేర్కొన్నారు.
Also Read: Mahesh Babu-Vinesh Phogat: పతకం ముఖ్యం కాదు.. మీరే నిజమైన ఛాంపియన్!
అనుష్క శర్మ, రణబీర్ కపూర్ కలిసి పలు సినిమాలలో నటించారు. 2016లో వచ్చిన ‘ఏ దిల్ హై ముష్కిల్’ భారీ హిట్ అయింది. అంతకుముందు 2014లో పీకే, 2015లో బాంబే వెల్వెట్, 2018లో సంజూ సినిమాల్లో ఇద్దరూ కలిసి నటించారు. 2017 పెళ్లి అనంతరం అనుష్క పూర్తిగా సినిమాలకు దూరమయ్యారు. గత ఏడాది చివరలో వచ్చిన ‘యానిమల్’తో రణబీర్ బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు. ఆలియా భట్, రణబీర్ దంపతులకు ఓ కూతురు ఉన్న విషయం తెలిసిందే.