Hyundai Exter Bookings: భారతదేశపు అతిపెద్ద కార్ల తయారీ సంస్థలో ఒకటైన ‘హ్యుందాయ్’ మోటార్ ఇండియా.. ఎక్స్‌టర్ రూపంలో సరికొత్త మైక్రో ఎస్‌యూవీని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ కారు అమ్మకాలు జోరుగా సాగుతున్నాయట. రిలీజ్ అయిన ఒక నెలలోనే 50,000 కంటే ఎక్కువ బుకింగ్‌లను పొందిందని హ్యుందాయ్ మోటార్ ఇండియా మేనేజర్ తరుణ్ గార్గ్ తెలిపారు. ఎక్స్‌టర్ బెంచ్‌మార్క్‌ను సెట్ చేసిందన్నారు. కస్టమర్‌లకు 6 ఎయిర్‌బ్యాగ్‌లతో పాటు అన్ని ట్రిమ్‌లలో ESC, VSM, HAC ఎంపికను ప్రామాణికంగా అందిస్తుంది.
తరుణ్ గార్గ్ మాట్లాడుతూ… ‘హ్యుందాయ్ ఎక్స్‌టర్‌తో బెంచ్‌మార్క్‌ను సెట్ చేశాం. అధునాతన సాంకేతికత, ఉన్నతమైన నాణ్యత, లేటెస్ట్ ఫీచర్‌లు, భద్రత మరియు కస్టమర్‌లకు సౌకర్యాన్ని ఇచ్చే అన్నింటిని ఎక్స్‌టర్‌లో ఇచ్చాం. ఎక్స్‌టర్ లాంచ్ అయిన 30 రోజుల కంటే తక్కువ వ్యవధిలో 50 వేలకు పైగా బుకింగ్‌లు వచ్చాయి’ అని అన్నారు. ఈ కారు ప్రారంభ ధర రూ. 5.99 లక్షలు. ఇది అమ్మకాల విషయంలో భారత మార్కెట్లో టాటా పంచ్‌తో పోటీపడుతుంది.
హ్యుందాయ్ ఎక్స్‌టర్ బేస్ వేరియంట్ ఎక్స్‌షోరూమ్ ధర రూ.5,99,900. అయితే టాప్ వేరియంట్ ధర మాత్రం రూ.9,31,990గా ఉంది. హ్యుందాయ్ విక్రయించే ఎస్‌యూవీల విభాగంలో ఇదే అత్యంత చౌకైనది. గ్రాండ్ ఐ10 నియోస్‌ను నిర్మించిన కె1 ప్లాట్‌ఫామ్ పైనే ఈ కారుని తయారు చేశారు. ఇది ఈఎక్స్, ఎస్, ఎస్‌ఎక్స్, ఎస్‌ఎక్స్(ఓ), ఎస్‌ఎక్స్(ఓ) కనెక్ట్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఇందులో ఆటో, సీఎన్‌జీ వేరియంట్ కూడా ఉన్నాయి.
ఎక్స్‌టర్ కారులో 1.2 లీటర్ ఎన్‌ఏ ఇంజిన్ ఉంది. ఇది 83 బీహెచ్‌పీ, 114ఎన్‌ఎం టార్క్ విడుదల చేస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యూవల్, 5 స్పీడ్ ఆటో గేర్‌బాక్స్‌ల ఆప్షన్లలో లభిస్తోంది. సీఎన్‌జీ ఇంజిన్ 69 బీహెచ్‌పీ, 95.2 ఎన్‌ఎం టార్క్‌ను విడుదల చేస్తుంది. ఏఎంటీ గేర్ బాక్స్‌కు పెడల్ షిఫ్టర్లను అందుబాటులో ఉంటాయి. పెట్రోల్ ఇంజిన్ మాన్యూవల్ ట్రాన్స్‌మిషన్ మైలేజీ లీటర్‌కు 19.4 కిమీ అని కంపెనీ తెలిపింది. ఆటోమేటిక్ వేరియంట్ 19.2 కాగా.. సీఎన్‌జీ వేరియంట్ కిలోకు 27.1 కిమీ దూరం ప్రయాణిస్తుందని హ్యుందాయ్ కంపెనీ వెల్లడించింది.
Also Read: Lucky Dreams: మీ కలలో ఆ స్త్రీ కనిపిస్తే.. నోట్ల వర్షం కురవడం పక్కా!
ఎక్స్‌టర్ కారులో మంచి ఫీచర్స్ ఉన్నాయి. డేటైమ్ రన్నింగ్ లాంప్స్, వెనుకవైపు హెచ్ ఆకారంలో ఎల్‌ఈడీ లైట్లు, 15 అంగుళాల డ్యూయల్ టోన్ అలాయ్ వీల్స్ ఉన్నాయి. ఈ కారు 3,815 ఎంఎం పొడవు.. 1,710 ఎంఎం వెడల్పు.. 1,631 ఎంఎం ఎత్తు ఉంటుంది వీల్ బేస్ 2,450 ఎంఎం కాగా.. గ్రౌండ్ క్లియరెన్స్ 185 ఎంఎంగా ఉంది. ఈ కారులో సింగల్ పాన్ సన్‌రూఫ్, ముందు వెనుక కెమెరాలు, ఆటోమేటిక్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, కీలెస్ ఎంట్రీ, 8 ఇంచెస్ టచ్‌స్క్రీన్, ఆటోమేటిక్ క్లైమెట్ కంట్రోల్, వైర్‌లెస్ ఛార్జింగ్, కనెక్టెడ్ కార్‌టెక్, వాయిస్ కమాండ్స్ వంటి ఫీచర్స్ ఉన్నాయి.