UP: ఒకే మైనర్ బాలుడిని ప్రేమించిన ఇద్దరు బాలికలు.. ముగ్గురూ కలిసి ఏం ప్లాన్ చేశారో చూడండి
- ముగ్గురు మైనర్ల మధ్య ప్రేమాయణం
- ముగ్గురూ కలిసి ఇంట్లో నుంచి పారిపోయిన వైనం
- ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో ఈ ఉదంతం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముగ్గురు మైనర్ల మధ్య ప్రేమాయణం సాగించిన విచిత్రమైన ఉదంతం ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో వెలుగు చూసింది. వాస్తవానికి షాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఇద్దరు మైనర్ బాలికలు ఓ మైనర్ బాలుడితో కలిసి ఇంటి నుంచి పారిపోయారు. బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, వెలుగులోకి వచ్చిన విషయం విస్మయానికి గురిచేసింది. ఇద్దరు అమ్మాయిలు స్నేహితులు, వారు ఒకే అబ్బాయితో జీవించడానికి అంగీకరించారు.
ఒకే అబ్బాయిని ప్రేమించిన14 -15 ఏళ్ల ఇద్దరు బాలికలు..
14 -15 ఏళ్ల ఇద్దరు బాలికలు ఒకే అబ్బాయిని ప్రేమించి, అతనితో కలిసి ఇల్లు వదిలి వెళ్లేందుకు అంగీకరించారు. ముందస్తు ప్రణాళిక ప్రకారం.. పాలు తీసుకొచ్చేందుకు ఇంటి నుంచి వెళ్లిన బాలిక సాయంత్రం వరకు తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురై ఆమె కోసం వెతకడం ప్రారంభించారు. విస్తృతంగా వెతికినా దొరకకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే ప్రాంతానికి చెందిన మరో బాలిక అదృశ్యమైనట్లు పోలీసుల విచారణలో తేలింది. పోలీసులు నిఘా, సీడీఆర్ ద్వారా దర్యాప్తు ప్రారంభించారు. బాలికలిద్దరూ 15 ఏళ్ల బాలుడితో పరారీలో ఉన్నారని తెలుసుకున్నారు.
Also Read
లక్నో హోటల్‌లో గదిలో ..
బాలికలిద్దరూ మైనర్ అబ్బాయితో అక్రమ సంబంధం పెట్టుకున్నారనే చర్చ సాగుతోంది. ముగ్గురూ కలిసి జీవించాలనుకున్నారు. దీంతో ముగ్గురూ తమ కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకుండా ఇంటి నుంచి పారిపోవాలని నిర్ణయించుకున్నారు. గత ఆదివారం, బీహార్‌లోని హతువాలోని ఓ హోటల్‌లో పోలీసులు ముగ్గురిని స్వాధీనం చేసుకుని సోమవారం వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ముగ్గురూ మొదట పారిపోయి లక్నో వెళ్లారు. ఎక్కడ చూసినా ఆధార్‌కార్డు అడగడంతో అక్కడ ఏ హోటల్‌లోనూ చోటు దొరకలేదు. విసుగు చెందిన ముగ్గురూ బీహార్ వెళ్లే రైలు ఎక్కి హతువా చేరుకున్నారు. అక్కడ ఓ హోటల్‌లో రూమ్ తీసుకున్నారు.
పోలీసులు ఏమంటున్నారు?
ఈ విషయమై కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు ప్రారంభించగా.. ముగ్గురి ఆచూకీ బీహార్‌లోని హతువా జిల్లాలోని ఓ హోటల్‌గా తేలిందని పోలీసులు చెబుతున్నారు. గోరఖ్‌పూర్ పోలీసులు బీహార్ పోలీసుల సహాయంతో ముగ్గురిని పట్టుకుని గోరఖ్‌పూర్‌కు తీసుకొచ్చారు. బాలికలిద్దరినీ వారి కుటుంబాలకు అప్పగించారు. మైనర్ నిందితుడైన బాలుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు.
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!