Site icon NTV Telugu

Gun Fire : అమెరికాలో రవితేజపై కాల్పులు.. ఎన్టీవీతో మృతుడి తండ్రి కన్నీటి పర్యంతం..

Us Fire

Us Fire

Gun Fire : అమెరికాలో ఉన్న ఒక యువకుడు పై దుండగులు కాల్పులు జరపగా, యువకుడు అక్కడే మృతి చెందాడు. ఈ యువకుడు, రవితేజ అనే పేరు గల హైద్రాబాద్ పట్నం చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధి లోని ఆర్కేపురం డివిజన్, గ్రీన్ హిల్స్ కాలనీ రోడ్ నెంబర్ 2 ప్రాంతం లో నివసించేవాడు. 2022 మార్చిలో, రవితేజ అమెరికా వెళ్లి అక్కడ మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశాడు. అనంతరం, ఉద్యోగం కోసం వెతుకుతూ ఉన్నాడు. ఇటీవల, వాషింగ్టన్ ఏవ్ లో దుండగులు జరిపిన కాల్పుల్లో రవితేజ ప్రాణాలు కోల్పోయాడు.

CM Revanth Reddy : ఇవాళ్టి నుంచి సీఎం రేవంత్‌ రెడ్డి దావోస్‌ పర్యటన

ఈ సంఘటనతో గ్రీన్ హిల్స్ కాలనీలో అతని ఇంటి వద్ద తీవ్ర విషాదం నెలకొంది. ఇప్పటికీ పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది, కానీ ఈ సంఘటన కుటుంబ సభ్యులు మరియు సమాజంలో తీవ్ర సంచలనం రేపింది. అమెరికాలో జరిగిన ఈ దారుణ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం కోసం అధికారులు విచారణ జరుపుతున్నారు.

Kolkata Doctor Case: కోల్కతా డాక్టర్ కేసులో సంజయ్ రాయ్కి నేడు శిక్ష ఖరారు..

అయితే.. ఎన్టీవీ తో రవితేజ తండ్రి మాట్లాడుతూ.. రెంటల్ క్యాబ్ ను దొంగిలించడానికి వచ్చిన దుండగులు కాల్పులు జరిపారు అని తెలిసింది.. 2022 లో అమెరికా వెళ్ళాడు.. చదువు పూర్తవ్వగానే జాబ్ చేస్తున్నాడు. చేతికి బుల్లెట్ దిగింది అని చెప్పారు.. ఆ తరువాత చనిపోయాడు అని చెప్పారు.. కష్టపడి చదివించా.. నా కొడుకు నన్ను చూసుకుంటున్నాడు అనుకునే లోపే లేకుండా పోయాడు..
వీలైనంత త్వరగా బాడీని తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను.. ఏ రాక్షసులు నా కొడుకుని పొట్టనపెట్టుకున్నారో..’ అని చెప్పుకుంటూ కన్నీటి పర్యంతమయ్యారు.

Exit mobile version