విశ్వనగరంగా డెవలప్మెంట్ అవుతున్న హైదరాబాద్‌కు మరో ఖ్యాతి దక్కింది. భారత దేశంలోని టాప్-10 హైస్ట్రీట్స్‌లో సోమాజీగూడకు సెకండ్ పొజిషన్ దక్కింది. దేశంలోని అన్ని మహానగరాల్లో మెరుగైన షాపింగ్ అనుభూతిని అందించే అత్యుత్తమ హైస్ట్రీట్ మార్కెట్లలో హైదరాబాద్‌లోని సోమాజిగూడ రెండు స్థానంలో నిలిచింది. ఈ లిస్టులో బెంగళూరులోని మహాత్మా గాంధీ రోడ్డు తొలి స్థానంలో నిలవగా.. సెకండ్ ప్లేస్ లో సోమాజిగూడ ఉంది. ఈ మేరకు ప్రముఖ రియల్ ఎస్టేట్ మార్కెట్ సంస్థ నైట్‌ఫ్రాంక్ ఓ నివేదికను తాజాగా విడుదల చేసింది.
Also Read : SS 4: గాలోడు కొత్త సినిమా మొదలై పోయింది!
భారత్ లోని ఏడు మెట్రో నగరాల్లో నైట్‌ఫ్రాంక్ సంస్థ సర్వే నిర్వహించింది.. థింక్ ఇండియా థింక్ రిటైల్-2023 హైస్ట్రీట్ రియల్ ఎస్టేట్ ఔట్‌లుక్ పేరుతో నివేదికను విడుదల చేసింది. షాపింగ్ చేసేందుకు సోమాజిగూడ అత్యంత అనుకూలంగా ఉందని.. ఇక్కడికి వచ్చే కొనుగోలుదారులకు స్థానిక రిటైల్ వ్యాపారులు కల్పిస్తున్న పార్కింగ్ వసతులు, ఇతర సౌకర్యాలు చాలా బాగున్నాయని నివేదికలో నైట్‌ఫ్రాంక్ తెలిపింది.
Also Read : Sunny: ‘అన్ స్టాపబుల్’ థియేట్రికల్ రిలీజ్ డేట్ ఖరారు!
ఈ మధ్య కాలంలో రిటైల్ వ్యాపారరంగంలో పోటీతత్వం బాగా పెరిగిపోయిందని ఆ సంస్థ ఇండియా సీఎండీ.. తమ అభిప్రాయం వెల్లడించింది. ఈ క్రమంలోనే కొనుగోలుదారులకు.. మంచి షాపింగ్ అనుభూతిని ఇవ్వటమనేది ప్రస్తుతం చాలా కీలకంగా మారిందన్నారు. అయితే.. అలాంటి మంచి షాపింగ్ అనుభూతి కలిగించే వీధులను హైస్ట్రీట్‌లుగా గుర్తిస్తారని ఈ సంస్థ తమ నివేదికలో పేర్కొంది. సోమాజిగూడలోని స్ట్రీట్ లో వ్యాపారులు చేస్తున్న సౌకర్యాలకు కొనుగోలుదారుల నుంచి స్పందని రావడంతో పాటు వ్యాపారాలు కూడా జోరుగా సాగుతున్నట్లు ఈ నివేదికలో వెల్లడించింది.