Hyderabad Rain: హైదరాబాద్ నగరంలో మళ్ళీ వర్షం మొదలైంది. గత పది రోజులుగా సాయంత్రం నుండి అర్ధరాత్రి వరకు వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. అయితే ఈ రోజు (సెప్టెంబర్ 23) ఉదయం నుంచే వర్షం మొదలయ్యింది. నగరంలో అక్కడక్కడా మోస్తరు వర్షం, మరికొన్ని చోట్ల ముసురు వాతావరణం నెలకొంది. ఇకపోతే వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం, నేటి నుంచి రాబోయే మూడు రోజుల పాటు నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
కొత్త ‘Nothing Ear (Open)’ TWS ఇయర్‌బడ్స్ లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా!
ఈ నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని అధికారులు సూచిస్తున్నారు. భారీ వర్షాల కారణంగా రోడ్లపై నీరు నిలిచిపోయే అవకాశం ఉంది కాబట్టి, వాహనదారులు జాగ్రత్తగా ఉండాలి. లోతట్టు ప్రాంతాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు.
US: టారిఫ్ ఉద్రిక్తతల వేళ కీలక పరిణామం.. జైశంకర్-మార్కో రూబియో భేటీ