NTV Telugu Site icon

CM Revanth Reddy : రేపు ఆరాంఘర్-జూ పార్క్ ఫ్లైఓవర్‌ను ప్రారంభిచనున్న సీఎం రేవంత్ రెడ్డి

Aramghar Zoopark Flyover

Aramghar Zoopark Flyover

CM Revanth Reddy : హైదరాబాద్ నగర వాసులకు శుభవార్త.. గ్రేటర్ హైదరాబాద్‌లో రవాణా వ్యవస్థను మెరుగుపరిచేందుకు చేపట్టిన ఎస్ఆర్డీపీ ప్రాజెక్టులో భాగంగా కొత్త ఫ్లైఓవర్‌లు అందుబాటులోకి వస్తున్నాయి. ప్రస్తుతం 42 పనులలో 36 పనులు పూర్తి అయ్యాయి. ఇందులో అత్యంత ప్రాముఖ్యమైన ఫ్లైఓవర్, జూపార్కు నుంచి ఆరాంఘర్ వరకు నిర్మించబడింది. ఇది సికింద్రాబాద్, వరంగల్, భువనగిరి, మేడ్చల్, హుజురాబాద్, మల్కాజిగిరి ప్రాంతాల వాసులకు శంషాబాద్ విమానాశ్రయానికి సిగ్నల్-ఫ్రీ ట్రావెల్‌ను సౌకర్యవంతంగా అందిస్తుంది.

PM Modi: 8న విశాఖకు ప్రధాని మోడీ.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన

రూపం దిద్దుకున్న ఈ ఫ్లైఓవర్ 6 లైన్లతో, 4 కిలోమీటర్ల పొడవుతో నిర్మించబడింది. రూ.799 కోట్ల వ్యయంతో నిర్మాణం పూర్తయింది. ఇది హైదరాబాద్ నగరంలోని పీవీ నరసింహారావు ఫ్లైఓవర్ తర్వాత అత్యంత పెద్దదిగా నిలుస్తుంది. ముఖ్యమంత్రి జనం వాహన రవాణా వ్యవస్థను మెరుగుపర్చేందుకు, జనవరి 6న ఈ ఫ్లైఓవర్‌ను ప్రారంభించనున్నారు.

ఈ ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయిన తరువాత, నగరంలోని కీలక జంక్షన్లలో ట్రాఫిక్ జామ్ లేకుండా వేగంగా ప్రయాణం చేయడానికి వాహనదారులకు ఉపయోగపడుతుంది. ఉదాహరణకు, ఉప్పల్ నుంచి నాగోల్, ఎల్బీ నగర్, బైరమల్‌గూడ, చాంద్రాయణ గుట్ట తదితర ప్రాంతాలకు వాహనాలు సులభంగా, వేగంగా ప్రయాణిస్తాయి. ఈ ఫ్లైఓవర్ ద్వారా కాలుష్యాన్ని తగ్గించి, ఇంధన వాడకం కూడా తగ్గించడానికి ఎంతో తోడ్పడుతుంది. ఈ ప్రాజెక్టు గ్రేటర్ హైదరాబాద్ రవాణా వ్యవస్థను మరింత సౌకర్యవంతంగా మార్చడం ద్వారా, ప్రజలకు సులభమైన మరియు తక్కువ సమయంతో ప్రయాణం చేసే అవకాశాన్ని కల్పిస్తుంది.

Zimbabwe: సింహాలతో నిండి ఉన్న అడవిలో తప్పిపోయిన 8 ఏళ్ల బాలుడు.. ఎలా బయటపడ్డాడంటే..