CP CV Anand: శనివారం ఉదయం 6:30 గంటల నుండి హైదరాబాద్ లో గణేష్ శోభయాత్రలు ప్రారంభం అయ్యాయి. ఈ శోభయాత్ర మొత్తం 40 గంటల పాటు నుండి కొనసాగుతుంది. ఇందుకు సంబంధించి హైదరాబాద్ సీపీ CV ఆనంద్ తెలిపిన వివరాల ప్రకారం, మొత్తం 12,034 విగ్రహాలకు ఆన్లైన్ లో ముందుగా పెర్మిషన్ ఇవ్వగా, ఇప్పటివరకు 6,300 విగ్రహాలు నిమజ్జనం పూర్తయ్యాయి. అదనంగా, 1 లక్షా 40 వేల విగ్రహాలు నిమజ్జనం జరిగినట్లు తెలిపారు. చిన్న విగ్రహాలను కలిపి ఇంకా 25 వేల విగ్రహాలు నిమజ్జనం అయ్యాయి.
Samantha: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమంత అవేర్ నెస్ వీడియో..
ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్రతో పాటు, పండగ 10వ రోజు నిమజ్జన కార్యక్రమాలు నిర్విరామంగా కొనసాగాయి. సిబ్బంది నిద్ర లేకుండా సమన్వయం చేస్తూ పని చేశారు. ముందుగా సౌత్ జోన్ ప్రాంతాల విగ్రహాలు నిమజ్జనం పూర్తి చేయాలని ప్లాన్ లో భాగంగా.. మొత్తం 40 క్రేన్‌లు ఏర్పాటు చేశారు. అయితే, ఈ సారి విగ్రహాల అధిక సంఖ్య కారణంగా ఆలస్యం జరిగింది. కొన్ని చిన్న గొడవల కారణంగా 5 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఇంకా కొన్ని విగ్రహాలు ఈ రోజు రాత్రి లేదా రేపు ఉదయం నిమజ్జనం పూర్తయ్యేలా అధికారులు చర్యలు చేపట్టారు.
Warangal: భార్యను కొడుతుండగా అడ్డువెళ్లిన తండ్రి.. కట్ చేస్తే..?
డ్రోన్ల వినియోగం ఈసారి కీలక పాత్ర పోషించింది. మొత్తం 4 డ్రోన్లు ఉపయోగించి పర్యవేక్షణ చేశారు. అలాగే, 35 హై రైజ్డ్ బిల్డింగ్‌ల పై కెమెరాలు ఏర్పాటు చేసి ప్రత్యేక మానిటరింగ్ నిర్వహించారు. ఈ చర్యల వల్ల పండుగను మరింత సమర్థవంతంగా, సురక్షితంగా నిర్వహించగలిగారు. సీఎం సడన్ గా ఎంట్రీ ఇచ్చారు. ఆయన సమర్థంగా పనుల నిర్వహణ పై ప్రశంసలు కురిపించారు. మొత్తం ప్రక్రియలో 1070 మంది ఆకతాయిలను గుర్తించి అరెస్ట్ చేశారు. కొందరిపై పిట్టీ కేసులు నమోదు చేసి, మరికొందరికి కౌన్సిలింగ్ అందించినట్లు CV ఆనంద్ పేర్కొన్నారు.