టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సమంత గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. 2010లో ‘ఏమాయ చేసావే’ సినిమాతో ప్రేక్షకులను మాయ చేసిన సామ్, చాలా తక్కువ సమయంలోనే స్టార్ రేంజ్‌కు ఎదిగారు. భాషతో సంబంధం లేకుండా దాదాపు అన్నీ పరిశ్రమల టాప్ హీరోలతో నటించి తన ప్రతిభను చాటుకున్నారు. ఇక కెరీర్ పీక్‌లో ఉన్న సమయంలోనే సమంతకు మయోసైటిస్ అనే వ్యాధి రావడం తో సినిమాలకు కొంత కాలం దూరమయ్యారు. ఈ లోపులో యశోద, శాకుంతలం, ఖుషి సినిమాలతో ప్రేక్షకులను కలిసినా, పాత స్పీడ్‌లో సినిమాలు చేయలేదు. ఫలితంగా సామ్ కొంత విరామం తీసుకోవాల్సి వచ్చింది. అయితే ఈ గ్యాప్‌ను వృథా చేయకుండా కొత్త ప్రయాణం ప్రారంభించారు.
Also Read : Kishkindha Puri: ఆడియన్స్ తప్పకుండా థ్రిల్ ఫీల్ అవుతారు.. నిర్మాత
హీరోయిన్‌గా మాత్రమే కాకుండా ఇప్పుడు సమంత నిర్మాతగా కూడా మారారు. ఇటీవలే తెలుగులో ‘శుభం’ సినిమా ద్వారా నిర్మాతగా బిజీ అయ్యారు. దీంతో ఆమె కెరీర్‌లో మరో కొత్త చాప్టర్ మొదలైంది. సినిమాలతో పాటు సామ్ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటూ అభిమానులతో టచ్‌లో ఉంటారు. తన అనారోగ్య సమయంలో పొందిన అనుభవాల కారణంగా కావచ్చు, సమంత తరచూ హెల్త్, ఫిట్నెస్, మెంటల్ వెల్‌బీయింగ్ పై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా వేదికల ద్వారా అభిమానులకు విలువైన టిప్స్ షేర్ చేస్తున్నారు. వర్కౌట్స్, డైట్ ప్లాన్స్, హెల్త్ సీక్రెట్స్ వంటి విషయాలను పంచుకుంటూ పాజిటివ్ ఎనర్జీని అందిస్తున్నారు.
ఇందులో భాగంగా ఇటీవల సమంత తన ఇన్‌స్టా ఖాతా ద్వారా ప్రెగ్నెన్సీ,మహిళల ఆరోగ్యంపై ఒక అవగాహనా వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియోలో ఆమె, మహిళల బలాన్ని పెంచడానికి ‘క్రియేటిన్’ పౌడర్ ఎంతో సహాయకం అవుతుందని చెప్పారు. ప్రత్యేకించి ప్రెగ్నెన్సీ సమయంలో, అలాగే మెనోపాజ్ దశలో క్రియేటిన్ మహిళలకు తక్షణ శక్తి, శారీరక బలం అందించడంలో ఉపయుక్తమని సమంత వివరించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో కేవలం అభిమానుల మధ్యే కాకుండా, ఫిట్నెస్ ఎక్స్‌పర్ట్స్, హెల్త్ కోచెస్, సాధారణ మహిళల మధ్య కూడా పెద్ద చర్చనీయాంశంగా మారింది. “సమంత లాంటి స్టార్ హీరోయిన్ ఇలాంటి హెల్త్ ఎడ్యుకేషన్ వీడియోలు చేయడం నిజంగా ప్రోత్సాహకరం” అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.