Hyderabad: భారతదేశపు తదుపరి స్టార్టప్ పవర్‌హౌస్‌గా హైదరాబాద్ కిరీటాన్ని కైవసం చేసుకుంది. భారతదేశంలోని మొదటి ఐదు స్టార్టప్ హబ్‌లలో ఒకటిగా నిలిచింది. ఇప్పటికే టెక్ హబ్‌గా పేరున్న బెంగళూరు, ముంబై, ఢిల్లీ-ఎన్‌సీఆర్, పుణె నగరాలు మన కంటే ముందున్నాయి. హైదరాబాద్‌లో స్టార్టప్ ఎకోసిస్టమ్ బలపడుతోందని.. ఇప్పటివరకు సుమారుగా 900 మిలియన్ డాలర్ల పెట్టుబడులు రావడమే దీనికి నిదర్శనం. భారతదేశంలోని 70కి పైగా యాక్టివ్ వెంచర్ క్యాపిటల్ సంస్థల సమగ్ర సర్వే ఆధారంగా, సాధారణ భాగస్వాములు, ప్రిన్సిపల్స్ వంటి సీనియర్-స్థాయి ఎగ్జిక్యూటివ్‌లు, పెట్టుబడిదారులు హైదరాబాద్‌కు భారతదేశపు తదుపరి స్టార్టప్ పవర్‌హౌస్ అనే బిరుదును అందించారు. ఈ మేరకు ప్రముఖ స్టార్టప్ మీడియా ప్లాట్‌ఫాం ఇంక్42 తాజా నివేదికలో వెల్లడించింది.
Also Read: Women Reservation Bill: ఆ బిల్లుపై వాడివేడి చర్చ.. మహిళా ఎంపీల ప్రసంగాలతో ప్రతిధ్వనించిన పార్లమెంట్
గత మూడేళ్లుగా హైదరాబాద్ ప్రధాన స్టార్టప్ స్థావరంగా ఎదుగుతోంది. గత మూడేండ్లలోనే ఒకేసారి నగరంలో 240 స్టార్టప్‌లకు భారీ మొత్తంలో పెట్టుబడులు వచ్చాయి. దీనికి 550 కంటే ఎక్కువ దేశీయ, అంతర్జాతీయ పెట్టుబడిదారులు మద్దతు ఇచ్చారు, దీని ఫలితంగా జనవరి 2014 నుంచి ఆగస్టు 2023 మధ్య మొత్తం 2.6 బిలియన్ డాలర్ల నిధులు సమకూరాయి. నివేదిక ప్రకారం, ఈకామర్స్, హెల్త్‌కేర్, ఎడ్‌టెక్, మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్‌తో సహా ప్రముఖ రంగాల కోసం హైదరాబాద్ మొదటి ఐదు స్టార్టప్ హబ్‌లలో ఒకటిగా నిలిచింది. అత్యాధునిక మౌలిక వసతులు, పరిమిత వ్యయంతో స్టార్టప్‌లను సమర్థంగా నిర్వహించే అత్యంత అనుకూల వాతావరణం ఉండటంతో స్టార్టప్ వ్యవస్థాపకులు, పెట్టుబడిదారులు హైదరాబాద్‌నే తమ గమ్యస్థానంగా ఎంచుకొంటున్నారు. బెంగళూరును సైతం వెనక్కి నెట్టి హైదరాబాద్ పెట్టుబడులను ఆకర్షిస్తోంది. ప్రధానంగా టీ-హబ్ ఏర్పాటు స్టార్టప్ రంగానికి ఎంతో ఊతమిచ్చేలా మారింది.
Also Read: Egyption Treasures: ఈజిప్టులో బయటపడిన పురాతన ఆలయం.. గుప్త నిధులు లభ్యం
అదేవిధంగా ఐఐటీ-హైదరాబాద్ వంటి అగ్రశేణి విద్యాసంస్థల నుంచి నైపుణ్యం కలిగిన మానవవనరుల లభ్యత స్టార్టప్ రంగం మరింత వృద్ధి చెందేందుకు దోహదం చేస్తోంది. మొత్తంగా హైదరాబాద్ మహానగరం బీ2బీ, సాస్ (ఎస్‌ఏఏఎస్), తయారీ, ఫిన్‌టెక్, ఐటీ రంగాలకు దిక్సూచిగా మారుతోంది. ఈ మేరకు ప్రముఖ స్టార్టప్ మీడియా ప్లాట్‌ఫాం ఇంక్42 తాజా నివేదికలో వెల్లడించింది. ఈ విజయానికి దోహదపడే ముఖ్యమైన అంశం ఏమిటంటే టీ-హబ్, వి-హబ్, ఇతర సంస్థలు స్టార్టప్‌లను ప్రోత్సహిస్తున్నాయి. అంతేకాకుండా నగరం ఐఐటీ-హైదరాబాద్ వంటి ప్రతిష్టాత్మక సంస్థల నుంచి అత్యంత నైపుణ్యం కలిగిన నిపుణుల సమూహాన్ని కలిగి ఉంది. ఐఐటీ-హైదరాబాద్, ఐఐఐటీ-హైదరాబాద్, ఐఎస్‌బీ వంటి సంస్థలు హైదరాబాద్‌లో ఉండడం కూడా నగరంలో స్టార్టప్‌లు పెరగడానికి కారణంగా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇవి విభిన్నమైన, అత్యంత నైపుణ్యం కలిగిన ప్రతిభకు సమిష్టిగా దోహదం చేస్తాయి. అంతేకాకుండా, స్టార్ట్-అప్‌లు, ఐఎస్‌బీ వంటి ప్రతిష్టాత్మక సంస్థల మధ్య సహకారాలు విజ్ఞాన మార్పిడి, ప్రతిభ సముపార్జనను ప్రోత్సహించాయి.
దేశవ్యాప్తంగా స్టార్టప్‌లకు 2014 నుంచి 2023 వరకు ఆకట్టుకునే స్థాయిలో పెట్టుబడులు వచ్చాయి. ఇందులో 1,900 ఒప్పందాల ద్వారా 141 బిలియన్ డాలర్ల నిధులు సమకూరాయి. స్టార్టప్‌ల కోసం పెట్టుబడిదారులు గతంలో ఢిల్లీ ఎన్‌సీఆర్, ముంబై, బెంగళూరు వంటి అగ్రశేణి నగరాలపై దృష్టి సారించేవారు. కానీ స్టార్టప్ రంగంలో హైదరాబాద్ క్రమంగా స్థానాన్ని పెంచుకుంటూ గణనీయమైన పెట్టుబడులను ఆకర్షిస్తుండడం విశేషం. రాష్ట్రంలో సరికొత్త ఆవిష్కరణలను (ఇన్నోవేషన్ ఎకో సిస్టం) వృద్ధిచేసేందుకు టీ-హబ్, టీఎస్‌ఐసీ, వీ-హబ్, రిచ్, టాస్క్, టీ-వర్క్స్, ఎమర్జింగ్ టెక్నాలజీస్ వింగ్, ఇమేజ్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఏర్పాటు చేశారు. మెంటార్‌షిప్, ఇంక్యుబేషన్, పరిశ్రమల అనుసంధానం చేయడంతో వందల స్టార్టప్స్ మద్దతు పొందాయి.
