Site icon NTV Telugu

Padi Kaushik Reddy: రేపు ఊహించని సాక్ష్యాలతో మీడియా ముందుకు వస్తా.. కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..!

Padi Kaushik Reddy

Padi Kaushik Reddy

హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను జైలుకు పంపేందుకు రేవంత్ రెడ్డి నిన్న రాత్రి నుంచే డ్రామా ఆడుతున్నారని విమర్శించారు. ఈ డ్రామాను ప్రజలు గమనిస్తున్నారని, తనపై జరుగుతున్న కుట్రలకు తాను భయపడనని స్పష్టం చేశారు. పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ.. “మా లీగల్ టీమ్‌కు పేరు పేరునా కృతజ్ఞతలు. నన్ను జైలుకు పంపాలని ఎన్ని కుట్రలు చేసినా భయపడను. నేను AK 47గా మారతా రేవంత్ రెడ్డి. మీ కుట్రలకు నేను భయపడే వాడిని కాదు.” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

READ MORE: AP Liquor Scam Case: లిక్కర్‌ కేసులో సిట్‌ దూకుడు.. వారి అరెస్ట్‌లపై ఫోకస్‌

మంత్రులు ఇసుక దందాల్లో, పేదల భూములను కబ్జా చేయడంలో నిమగ్నమయ్యారని ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి ఆరోపించారు. బిడ్డా మీ బట్టలు విప్పుతా.. మీ అక్రమాలు ఆధారాలతో సహా బయట పెడతా అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రేపు హైదరాబాద్‌లో ఊహించని సాక్ష్యాలతో మీడియా ముందు వస్తానని ప్రకటించారు. తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి అన్ని ఆధారాలు బయటపెడతానన్నారు. రేవంత్ రెడ్డి సర్కార్ అక్రమాలను బయటపెడతానని స్పష్టం చేశారు.

READ MORE: Brahmanandam: కన్నప్ప సినిమాని ఆదరించండి…అల్లరి చేయకండి !

Exit mobile version