రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో భార్యను హత్య చేసినందుకు బిజెపి నాయకుడు అరెస్టు అయ్యాడు. ఈ సంఘటన ఆగస్టు 10న జరిగింది. ఎవరో దుండగులు హత్య చేశారని చిత్రీకరించడానికి ప్రయత్నించారు, కానీ పోలీసులు దానిని భర్తే హత్య చేశాడని వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బిజెపి నాయకుడు రోహిత్ సైని తన ప్రియురాలు రీతు సైని కోరిక మేరకు తన భార్య సంజును హత్య చేశాడు. మొదట్లో, కొంతమంది గుర్తుతెలియని దొంగలు ఇంట్లోకి చొరబడి, సంజును హత్య చేసి, విలువైన ఆభరణాలను తీసుకొని పారిపోయారని రోహిత్ పోలీసులకు చెప్పడానికి ప్రయత్నించాడు. కానీ పోలీసులు ఇంటెన్సివ్ విచారణ ప్రారంభించినప్పుడు, రోహిత్ చెప్పే సమాధానాలు అనుమానాస్పదానికి దారితీశాయి.
Also Read:Anirudh : అనిరుధ్‌కు వార్నింగ్ ఇస్తున్న ఆడియన్స్..?
నిందితుడిని తమదైన శైలిలో ప్రశ్నించగా, నేరం అంగీకరించాడని రూరల్ అదనపు ఎస్పీ దీపక్ కుమార్ తెలిపారు. రోహిత్ తన ప్రేయసి రీతుతో చాలా కాలంగా సంబంధం కలిగి ఉన్నాడని, అతని భార్య సంజు వారి సంబంధానికి అడ్డుగా మారిందని చెప్పాడు. సంజును అడ్డుతప్పించాలని రీతు తనపై ఒత్తిడి తెచ్చింది, ఈ ఒత్తిడిలో రోహిత్ తన భార్యను దారుణంగా హత్య చేశాడని తెలిపాడు.
Also Read:Tollywood : సమస్య పరిష్కారం కోసం రంగంలోకి చిరంజీవి
హత్య చేసిన తర్వాత, పోలీసులను తప్పుదారి పట్టించడానికి రోహిత్ మొత్తం సంఘటనను దోపిడి దొంగల పని అన్నట్లుగా చూపించాలని ప్లాన్ చేశాడు. కానీ పోలీసుల విచారణలో కుట్ర మొత్తం బయటపడింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు రోహిత్ సైనీని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. దర్యాప్తులో అతని స్నేహితురాలు రీతు ప్రమేయం వెలుగులోకి రావడంతో, పోలీసులు ఆమెను కూడా అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.