Anirudh : అనిరుధ్‌కు వార్నింగ్ ఇస్తున్న ఆడియన్స్..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ పేరు వినగానే హిట్ గ్యారెంటీ అనే నమ్మకం ఉండేది. ఎందుకంటే ఆయన కంపోజ్ చేసిన ఆల్బమ్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రాణం పోసేవి. అందుకే ఆయన నుంచి మ్యూజిక్ వస్తుందంటే ఆ సినిమాకు అదనపు బజ్ క్రియేట్ అవుతుందనేది నిజం. అందుకే భాష తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు అనిరుధ్ డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు.. కానీ
గత కొంతకాలంగా అనిరుధ్ ఇచ్చిన ఆల్బమ్స్ ఆ అంచనాలకు తగ్గట్లుగా లేకపోవడంపై చర్చ మొదలైంది. మొదట రజనీకాంత్ నటించిన ‘వెట్టయన్’ చిత్రం తో ఈ విమర్శలు మొదలవ్వగా. ఆ తర్వాత అజిత్ హీరోగా వచ్చిన ‘విడాముయార్చి’ ఆల్బమ్ కూడా పెద్దగా ప్రభావం చూపలేదు. తాజాగా విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’ చిత్రానికి ఇచ్చిన మ్యూజిక్‌పై కూడా ప్రేక్షకులు నిరాశ వ్యక్తం చేశారు. ఇక రీసెంట్‌గా రిలీజ్ అయిన రజనీకాంత్–లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ ‘కూలీ’ కూడా అనిరుధ్‌కు చేదు అనుభవం మిగిల్చింది. సినిమా హైప్, కంటెంట్ విషయం పక్కన పెడితే, ఈ సినిమాలో ఆయన మ్యూజిక్ స్పెషల్‌గా నిలవలేదన్న మాట ఎక్కువగా వినిపిస్తోంది. ఇలా వరుస సినిమాల్లో అనుకున్నంత మేజిక్ చేయలేకపోవడం వల్లే, ఆడియన్స్ ఇప్పుడు అనిరుధ్‌కి ‘మ్యూజిక్‌లో కొత్త ధనం తీసుకురా, లేదంటే మరీ మామూలుగా మారిపోతావు’ అన్న సంకేతం ఇస్తున్నారని ఇండస్ట్రీలో టాక్. మరి అనిరుధ్ ఈ వార్నింగ్స్‌ని సీరియస్‌గా తీసుకుని తిరిగి తన మార్క్ మ్యూజిక్‌తో అలరిస్తారా? లేకపోతే ఈ నెగెటివ్ వేవ్ కొనసాగుతుందా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. మరి దీని అనిరుధ్ సీరియస్‌గా తీసుకుంటారా? లేదా అనేది చూడాలి.
Also Read
తాజావార్తలు
-
Duddilla Sridhar Babu: మంథనిలో అభివృద్ధి పనుల జాతర.. రూ.164 కోట్లతో శంకుస్థాపనలు
-
Nayyi Navelli: దసరాకు యామీ గౌతమ్ ‘నయ్యి నవెల్లి’
-
MG Hector Tomahawk EV: 7 సీటర్ SUV సెగ్మెంట్లో గేమ్‌ఛేంజర్..! మహీంద్రా XEVకి పోటీగా కొత్త EV..
-
Arunachal Pradesh: అరుణాచల్‌లో చైనా చొరబాటుపై కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..
-
CJI Surya Kant: ‘సీజేఐ సూర్యకాంత్ తండ్రిలాంటి వారు’.. బార్ అసోసియేషన్ కొత్త అధ్యక్షుడు ప్రశంసలు
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!