Nagpur: నాగ్‌పూర్‌లో అనుమానంతో భర్త తన భార్యను హతమార్చిన షాకింగ్ సంఘటన నాగ్‌పూర్‌లో వెలుగు చూసింది. ఈ మేరకు నందనవన్ పోలీస్ స్టేషన్‌లో హత్య కేసు నమోదైంది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై సమగ్ర విచారణ జరుపుతున్నారు. నిందితుడి పేరు రమేష్ భాస్కర్. మృతి చెందిన మహిళ పేరు అర్చన రమేష్ భాస్కర్. ఈ ఘటనతో నందనవన్ ప్రాంతంలో సంచలనం నెలకొంది. నాగ్‌పూర్‌లో హత్యల సీజన్ ఆగే సూచనలు కనిపించడం లేదు. ఏదో ఒక కారణంతో హత్యలు జరుగుతున్న ఘటనలు నిత్యం వెలుగులోకి వస్తున్నాయి.
Read Also:Mahesh Babu: సూర్యా భాయ్ ఒక డ్రగ్ లాంటోడు…
అసలు ఏం జరిగింది?
అర్చన నిరంతరం ఎవరితోనో ఫోన్‌లో మాట్లాడుతూ ఉండేది. దీంతో భర్తకు ఆమెపై అనుమానం వచ్చింది. దీంతో భార్యాభర్తల మధ్య నిత్యం గొడవలు జరుగుతుండేవి. ఈ వివాదం కారణంగా అతని భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. ఆమె రెండు నెలల క్రితం తిరిగి ఇంటికి వచ్చింది. ఆ తర్వాత మళ్లీ ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ గొడవ కారణంగా సోమవారం రాత్రి నిద్రకు ఉపక్రమించిన భార్యను భర్త అర్ధరాత్రి సుత్తితో ఆమె తలపై కొట్టాడు. దీంతో ఆమె తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందింది.
Read Also:June Aviation Data: దేశీయ విమాన ట్రాఫిక్‌లో పెరుగుదల.. జూన్‌లో 1.24కోట్లకు పైగా ప్రయాణీకులు
సమాచారం అందుకున్న నందనవన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు భర్తను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని పోలీసులు మరింత లోతుగా విచారిస్తున్నారు. ఈ ఘటనతో మహిళ కుటుంబీకులు షాక్‌కు గురయ్యారు. ఆ కుటుంబంలో కొండంత విషాదం నెలకొంది. భాస్కర్ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. తల్లి హత్యతో బాలికలు అనాథలుగా మారారు. అలాగే హత్య చేసిన తండ్రి జైలుకు వెళ్లడంతో ఈ ఆడపిల్లల పెంపకం చర్చనీయాంశమైంది.